ASBL NSL Infratech

ఉత్తర అమెరికాలో సంపూర్ణ సూర్యగ్రహణం.. ఇలా!

ఉత్తర అమెరికాలో సంపూర్ణ సూర్యగ్రహణం.. ఇలా!

ఉత్తర అమెరికాలో సంపూర్ణ సూర్య గ్రహణాన్ని వీక్షించడానికి జనం విపరీతంగా ఆసక్తి చూపారు. అంతరిక్షం నుంచి చూసినప్పుడు భూమిపై గ్రహణం ఎలా కనిపిస్తుందో తెలుసుకోవడానికి స్టార్‌లింక్‌ ఉపగ్రహం రంగంలోకి దిగింది. అరుదైన దృశ్యాలను రికార్డు చేసింది. భూమికి చుక్క పెట్టినట్లు చంద్రుడి నీడ స్పష్టంగా అందులో కనిపిస్తోంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌) నుంచి సంపూర్ణ సూర్యగ్రహణాన్ని చిత్రీకరించారు. దక్షిణ కెనడాపై 260 మైళ్ల ఎత్తులో ఈ కేంద్రం ప్రయాణిస్తుండగా భూమిపై చంద్రుడి నీడ కదులుతూ స్పష్టంగా కనిపిస్తోంది. అది ఏ ప్రాంతానికి చేరితే అక్కడ చీకట్లు అలముకుంటున్నట్లుంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :