ASBL NSL Infratech

ఆర్ఎస్‌ఎస్ ప్లాన్ ప్రకారమే కాంగ్రెస్‌లో చేరి తిరిగొచ్చేశా : బీజేపీ నేత షాకింగ్ కామెంట్స్

ఆర్ఎస్‌ఎస్ ప్లాన్ ప్రకారమే కాంగ్రెస్‌లో చేరి తిరిగొచ్చేశా : బీజేపీ నేత షాకింగ్ కామెంట్స్

మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ నేత రామ్‌కిషోర్ శుక్లా అలియాజ్ భయ్యాజీ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఇండోర్‌లోని మహూ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన రామ్‌కిషోర్‌.. ఇటీవలే ఆ పార్టీని వీడి తిరిగి బీజేపీలో చేరారు. తాజాగా మహూలో విలేకరులతో మాట్లాడిన ఆయన.. ఆర్ఎస్ఎస్ ప్లాన్ ప్రకారమే తాను కాంగ్రెస్‌లోకి వెళ్లానని, ఆ పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయానని షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘అసెంబ్లీ ఎన్నికలకు ముందు నేను కాంగ్రెస్‌లోకి మారా. కాంగ్రెస్ టికెట్‌పై మహూలో పోటీ చేసి ఓడిపోయా. ఇదంతా ఎన్నికల వ్యూహంలో భాగంగా జరిగింది. గత ఏడాది అక్టోబర్‌లో ఆర్‌ఎస్‌ఎస్ సీనియర్ నేత ఆదేశాల మేరకు నేను అలా చేశా’ అంటూ భయ్యాజీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

అప్పట్లో బీజేపీ తరపున పోటీకి దిగిన ఉషా ఠాకూర్‌ దీదీని సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలే వ్యతిరేకించారని, అందుకే తాను కాంగ్రెస్‌లో చేరి ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయానని, ఉషా దీదీ గెలిచేందుకు ఇదంతా ఆర్ఎస్ఎస్ వేసిన ప్లాన్ అని రామ్‌కిషోర్ శుక్లా పేర్కొనడం ప్రస్తుతం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఇదిలా ఉంటే 2023 మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన ఉషా ఠాకూర్‌ 1,02,989 ఓట్లు సాధించి విజయం సాధించగా.. స్వతంత్ర అభ్యర్థి అంతర్ సింగ్ దర్బార్‌కు 68,697 ఓట్లు దక్కించుకుని రెండో స్థానంలో నిలిచారు. ఇక బీజేపీపై తిరుగుబాటు చేసి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన రామ్‌కిషోర్ శుక్లాకు 29,144 ఓట్లు వచ్చాయి. ఫలితంగా ముక్కోణపు పోటీలో బీజేపీ అభ్యర్థి ఉషా ఠాకూర్ రికార్డు స్థాయి మెజార్టీతో విజయం సాధించారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :