పవన్ ఆస్తులపై పోతిన మహేశ్ వైరల్ స్టేట్మెంట్..
ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ టైంలో ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు అధికార పార్టీ అటు విపక్షాల మధ్య మాటల యుద్ధాలు తీవ్రమవుతున్నాయి. వీరు చేసే విమర్శలకు వారు చేసే ప్రతి విమర్శలతో వాతావారణం తీవ్రమవుతోంది.ఈ నేపథ్యంలో జనసేన పార్టీ టికెట్ దక్కకపోవడంతో రాజీనామా చేసి వైసీపీలో చేరిన పోతిన మహేష్ పవన్ కళ్యాణ్ ఆస్తుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో పోతిన రమేష్ తనకు ఎదురైన ప్రశ్నకు జవాబుగా పవన్ కళ్యాణ్ సినిమాల్లో సంపాదించిన డబ్బు పార్టీకి ఖర్చు పెడుతున్నాడని జనసైనికులు అంటుంటారు.. కానీ డబ్బు కోసం పవన్ సీట్లు అమ్ముకున్నారు అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు చంద్రబాబు నుంచి కూడా పవన్ కి డబ్బులు ముడుతున్నాయని ఆయన ఆరోపించారు.
Tags :