ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

డల్లాస్ నాట్స్ వాలీబాల్ టోర్నమెంట్‌కు మంచి స్పందన

డల్లాస్ నాట్స్ వాలీబాల్ టోర్నమెంట్‌కు మంచి స్పందన

అమెరికాలో తెలుగుజాతిని ఒక్కటి చేసేలా నాట్స్ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా నాట్స్ డల్లాస్ విభాగం తాజాగా నాట్స్ వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించింది. మార్చి 15,16 తేదీల్లో నిర్వహించనున్న నాట్స్ తెలుగువేడుకలకు సన్నాహకంగా ఈ వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. స్థానిక మ్యాక్ స్పోర్ట్స్ లూయిస్ విల్లే వేదికగా జరిగిన టోర్నమెంట్‌లో 200 మందికి పైగా క్రీడాకారులు 24 జట్లుగా పోటీ పడ్డారు. నాట్స్ డీటీవీ కప్, నాట్స్ వాలంటీర్ కప్, నాట్స్ హెల్ప్ లైన్ కప్ ఇలా మూడు విభాగాల్లో ఈ పోటీలు జరిగాయి. ఆద్యంతం ఆసక్తిగా జరిగిన ఈ టోర్నమెంట్లో, నాట్స్ డీటీవీ కప్ విజేతగా ఇండీ రూట్స్ టీం, రన్నర్-అప్ గా వాలీ వూల్వ్స్ టీం నిలిచాయి.

నాట్స్ వాలంటీర్స్ కప్ విజేతగా "అవెంజర్స్ 2", రన్నర్-అప్ గా "ఎఫ్.ఎస్.యు రైజర్స్" నాట్స్ హెల్ప్ లైన్ కప్ విజేతగా "బ్లాకింగ్స్", రన్నర్-అప్ గా "సెలీనా స్ట్రైకర్స్" నిలిచాయి. ఈ టోర్నమెంట్ ని విజయవంతంగా నిర్వహించిన నాట్స్ డల్లాస్ డీటీవీ స్పోర్ట్స్ కోఆర్డినేటర్స్ అభిరామ్ సన్నపరెడ్డి, హర్ష పిండి, గౌతమ్ కాసిరెడ్డి, ఇతర కార్యవర్గ సభ్యులు రవీంద్ర చుండూరు, కళ్యాణ్ చంద్ దాసరి, శివ నాగిరెడ్డి, శ్రీధర్ న్యాలమడుగుల, త్రినాథ్, వంశీ నాగళ్ళ, మురళి కొండేపాటి, జానా పాటిబండ్ల, సురేష్ వులవుల, విజయ్ బల్లా, రవి చిట్టూరి, నాట్స్ చాప్టర్ కోఆర్డినేటర్స్ సత్య శ్రీరామనేని, రవి తాండ్రలు, జోనల్ వైస్ ప్రెసిడెంట్ డీవీ ప్రసాద్, టాంటెక్స్ మాజీ అధ్యక్షులు సత్యం వీర్నపులను ఈ టోర్నమెంట్లో పాల్గొన్న క్రీడాకారులు, కమ్యూనిటీ మెంబెర్స్‌ని అభినందించారు.

ఇంకా ఈ టోర్నమెంట్లో నాట్స్ అధ్యక్షులు బాపయ్య చౌదరి (బాపు) నూతి, నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రాజేంద్ర మాదాల పాల్గొని, క్రీడాకారులను ప్రోత్సహించారు. ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ, క్రీడా స్ఫూర్తిని పెపొందించే విధంగా గత 14 సంవత్సరాలనుండి ప్రతి సంవత్సరం విజయవంతంగా నిర్వహిస్తున్న డల్లాస్ కార్యవర్గ సభ్యులకు ప్రత్యేక అభినందించారు. మార్చి 15-16వ తేదీలలో అల్లెన్ ఈవెంట్ సెంటర్లో జరుపబోతున్న నాట్స్ డల్లాస్ తెలుగు వేడుకలకు జరిగే ఏర్పాట్ల గురించి బాపు నూతి వివరించారు. మన తెలుగు వారందరిని ఈ వేడుకలకు ఆహ్వానించారు. వాలీబాల్ టోర్నమెంట్‌ని దిగ్విజయం చేసిన నాట్స్ డల్లాస్ విభాగాన్ని నాట్స్ బోర్డు చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని అభినందించారు.

 

Click here for Photogallery

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :