ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

న్యూజెర్సి, ఫిలడెల్ఫియాలో ఘనంగా జరిగిన నాటా అందాల పోటీలు..

న్యూజెర్సి, ఫిలడెల్ఫియాలో ఘనంగా జరిగిన నాటా అందాల పోటీలు..

ఉత్తర అమెరికా తెలుగు సమితి ఆధ్వర్యంలో జూన్‌ 30 నుంచి జూలై 2వ తేదీ వరకు నిర్వహించనున్న నాటా కన్వెన్షన్‌ సంబరాల్లో భాగంగా నాటా అందాల పోటీలను వివిధ నగరాల్లో నిర్వహిస్తున్నారు.  టీన్‌ నాటా 2023, మిస్‌ నాటా 2023, మిసెస్‌ నాటా 2023 పేరుతో ఏర్పాటు చేసిన ఈ పోటీలకు చైర్‌గా  ఉషా చింత ఉన్నారు. జూన్‌ 3వ తేదీన ఫిలడెల్ఫియాలోనూ, జూన్‌ 4న న్యూజెర్సిలో అందాల పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు ఎంతోమంది ఉత్సాహంతో ముందుకు వచ్చారు. ఈ పోటీలను తిలకించేందుకు దాదాపు 500 మందికిపైగా హాజరయ్యారు. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారు డల్లాస్‌ కన్వెన్షన్‌ వేదికపై జరిగే ఫైనల్‌ పోటీల్లో పాల్గొననున్నారు. విజేతలకు కిరీటంతో పాటు మోడలింగ్‌ అవకాశాలు, షార్ట్‌ ఫిల్మ్‌ అవకాశాలు మరియు ప్రత్యేక బహుమతులు లభిస్తాయని ఉషా చింత తెలిపారు. ఈ పోటీలకు న్యాయనిర్ణేతలుగా టాలీవుడ్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీ నటీమణులు లయ గోర్టీ మరియు పూజా రaవేరి ఉన్నారని చెప్పారు. నాటా ప్రెసిడెంట్‌ శ్రీధర్‌ రెడ్డి కొర్సపాటి, పాస్ట్‌ ప్రెసిడెంట్‌ రాఘవ రెడ్డి గోసాల, ఇతర సభ్యుల సహకారంతో ఈ పోటీలను విజయవంతంగా నిర్వహించినట్లు ఆమె తెలిపారు.

 

Click here for Event Gallery

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :