ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

అమెరికాలో 'ఇండియా డే పెరేడ్‌' లో పాల్గొన్న 'మాటా' 

అమెరికాలో 'ఇండియా డే పెరేడ్‌' లో పాల్గొన్న 'మాటా' 

▪️ అగ్ర‌రాజ్యంలో భార‌త త్రివ‌ర్ణ ప‌తాకం రెప‌రెప‌లు
▪️ 'ఐబీఏ - ఇండియా డే పెరేడ్‌'లో తెలుగు సంఘం 'మాటా' 
▪️ భారతమాత, స్వాత్రంత్యయోధుల వేషాధారణల‌తో 'మాటా' సంద‌డి

న్యూజెర్సీ: అగ్ర‌రాజ్యం అమెరికాలో భార‌త త్రివ‌ర్ణ ప‌తాకం రెప‌రెప‌లాడింది. భారత స్వాతంత్య్ర‌ దినోత్సవం సందరభంగా ఇండియన్ బిజినెస్ అసోసియేషన్(IBA), ఇండియా డే పెరేడ్ ను ఘనంగా  నిర్వ‌హించింది. 77వ భార‌త స్వాతంత్య్ర వేడుక‌ల్లో భాగంగా న్యూజెర్సీ ఎడిష‌న్ ప్రాంతంలోని ఓక్‌ట్రీ రోడ్‌లో ఇండియా డే పరేడ్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ టీం, ప్ర‌వాస భార‌తీయులు జాతీయ జెండాలను చేతబ‌ట్టి భారతమాతకి జై అంటూ నినాదాలు చేశారు. ఈ వేడుకల్లో ముఖ్యఅతిథిగా స్టార్ హీరోయిన్ మిల్కీబ్యూటీ తమన్నా భాటియా పాల్గొన్నారు.

మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ సభ్యులు భారతమాత, స్వాత్రంత్య యోధుల వేషాధారణలో క‌నిపించి ఆకట్టుకున్నారు. ఆట‌పాట‌ల‌తో అల‌రించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే  విధంగా డప్పు, వాయిద్యాలతో, ఆట పాటలతో పెరేడ్‌లో పార్టిసిపేట్ చేసి తమ దేశభక్తి ని చాటుకున్నారు. పెరేడ్ కు వచ్చిన ప్ర‌వాస భార‌తీయులు ఒకరికొకరు  స్వాత్రంత్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. పరేడ్‌లో భాగంగా భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా శకటాలను ప్రదర్శించారు. భారీ జాతీయ జెండాలతో ఊరేగింపు నిర్వహించడం వంటి కార్యక్రమాలతో అమెరికాలోని న్యూజెర్సీ ప్రాంత‌మంతా మువ్వన్నెల జెండా రెపరెపలతో సందడిగా మారింది. 

అమెరికాలో జ‌రిగిన ఈ భార‌త స్వాతంత్య్ర వేడుక‌ల్లో పాల్గొన్న తొలి తెలుగు సంఘం 'మ‌న అమెరికన్ తెలుగు అసోషియేష‌న్' (MATA). ఈ సంద‌ర్భంగా 'మాటా' వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీనివాస్ గనగోని ప్ర‌వాసీయుల‌కు, భారతీయులందరికీ 77వ‌ భారత స్వాతంత్య్ర‌ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్ర‌వాసీయులు మాతృభూమి రుణం తీర్చుకుందామంటూ పిలుపునిచ్చారు. 'మాటా' యూఎస్ఏ - 'మాటా' ఇండియా.. ఇలా రెండు చోట్ల త‌మ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నట్టు తెలిపారు. స్వాతంత్య్ర వేడుక‌ల్లో 'మాటా' (ED) కిరణ్ దుద్దగి, కోశాధికారి గంగాధర్ వుప్పల, ఐవీపీ శ్రీధర్ గుడాల, ఆర్‌వీపీ మల్లిక్ రెడ్డి, ఎస్సీ రంగ మాడిశెట్టి, ఆర్‌వీపీ కృష్ణ సిద్ధాడ.. త‌దిత‌రులు పాల్గొన్నారు.

 

Click here for Event Gallery

 

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :