ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఇజ్రాయెల్ కు మా అండ: బైడెన్

ఇజ్రాయెల్ కు మా అండ: బైడెన్

ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడి జరిగిన వెంటనే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వరుస భేటీల్లో బిజీ అయ్యారు. అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ సీఐఏ, నిఘా సంస్థ, జాతీయ భద్రత తదితర విభాగాల అధికారులతో భేటీ అయ్యారు. ఆ తర్వాత జీ7 దేశాధినేతలతో భేటీకి ఏర్పాట్లు చేశారు. నెతన్యాహుతో ఫోన్‌లో మాట్లాడి, ఎప్పటికప్పుడు పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇజ్రాయెల్‌కు అండగా ఉంటాం. ఉక్కు పిడికిలితో ఇజ్రాయెల్‌కు రక్షణగా నిలుస్తాం అని వ్యాఖ్యానించారు. ఇరాన్‌ భీకర దాడులను ఎదుర్కొని, శత్రువును ఓడించడంలో ఇజ్రాయెల్‌ అద్భుతమైన సామర్థ్యాన్ని ప్రదర్శించిందని కొనియాడారు. ఇరాన్‌ డ్రోన్లు, క్షిపణులను కూల్చివేయడంతో సాయం చేశామన్నారు. ఇజ్రాయెలకు మద్దతును కొనసాగిస్తామని తెలిపారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :