ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఇస్రో జయపతాకం..

ఇస్రో జయపతాకం..

అంతరిక్షంలో ప్రయోగించిన ఉపగ్రహాల్లోని విడిభాగాలు, వాటిని మోసుకెళ్లే వాహకనౌకల పునరుద్ధరణ దిశగా భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ప్రయోగం మరోసారి విజయవంతమైంది. అంతరిక్ష యాత్రల ఖర్చును భారీగా తగ్గించుకోవడమే లక్ష్యంగా పునర్వినియోగ వాహకనౌకల (రీయూజబుల్‌ లాంచ్‌ వెహికిల్‌ ల్యాండింగ్‌ ఎక్స్‌పెరిమెంట్‌- ఆర్‌ఎల్‌వీ ఎల్‌ఈఎక్స్‌) పనితీరును గతేడాది ఏప్రిల్‌లో పరిశీలించారు. ఇదే వాహనాన్ని ఆధునికీకరించి రూపొందించిన ఆర్‌ఎల్‌వీ ఎల్‌ఈఎక్స్‌-02ను శుక్రవారం ఉదయం పరీక్షించారు. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా ఏరోనాటికల్‌ టెస్ట్‌రేంజ్‌ (ఆర్‌టీఆర్‌)లో ఉదయం 7:01 గంటలకు చేపట్టిన ల్యాండింగ్‌ ప్రయోగం విజయవంతమైనట్లు ఇస్రో ప్రకటించింది. పుష్పక్‌ పేరుతో పిలిచే ఈ రెక్కల వాహనాన్ని భారతీయ నౌకాదళానికి చెందిన చినూక్‌ హెలికాప్టర్‌ ద్వారా తీసుకెళ్లి రన్‌వేకి నాలుగు కిలోమీటర్ల దూరం, 4.5 కిలోమీటర్ల ఎత్తులో జారవిడిచారు. అక్కడి నుంచి నిర్దేశిత మార్గంలో ఎలాంటి అవరోధాలు లేకుండా పుష్పక్‌ స్వతంత్రంగా రన్‌వేలో దిగింది. ఇందులో అమర్చిన బ్రేక్‌ ప్యారాచూట్‌, ల్యాండింగ్‌ గేర్‌ బ్రేక్స్‌, నోస్‌ వీల్‌ స్టీరింగ్‌ వ్యవస్థలను సమర్థంగా వినియోగించుకుంటూ సురక్షితంగా కిందకు దిగినట్లు ఇస్రో వెల్లడించింది.

స్వదేశీ సాంకేతికతలో మైలురాయి

అంతరిక్షం నుంచి తిరుగు ప్రయాణానికి కీలకమైన అతివేగ నియంత్రణ వ్యవస్థలను ఈ ప్రయోగం ద్వారా పరీక్షించారు. నేవిగేషన్‌, ల్యాండింగ్‌ గేర్‌, నియంత్రణ వ్యవస్థలను స్వదేశీ సాంకేతికతతో రూపొందించారు. ఆర్‌ఎల్‌వీ-ఎల్‌ఈఎక్స్‌-01లో వినియోగించిన హార్డ్‌వేర్‌ వ్యవస్థలన్నీ తాజా వాహనంలోనూ అమర్చగా, ఎయిర్‌ఫ్రేమ్‌ నిర్మాణం, ల్యాండ్‌ గేర్‌లను బరువులను మోయగలిగిన స్థాయిలో మెరుగుపరిచారు. కక్ష్యలోని ఉపగ్రహాలకు ఇంధనాన్ని అమర్చడం, వాటి వ్యవస్థల మరమ్మతులకు ఆర్‌ఎల్‌వీ ఎంతో ఉపయుక్తం కాగలదని ఇస్రో ప్రకటించింది. ఉపగ్రహాలు, వాహకనౌకల్లో వినియోగించే ఎలక్ట్రానిక్స్‌ ఉపకరణాల వ్యయాన్ని తగ్గించడంలో ఆర్‌ఎల్‌వీ కీలకపాత్ర వహిస్తుందని ఇస్రో అధిపతి డాక్టర్‌ ఎస్‌.సోమనాథ్‌ బెంగళూరులో వెల్లడించారు.

ఇంతకూ ఈ RLV LEX ఉపయోగమేంటి..?

సాదారణంగా అంతరిక్ష ప్రయోగాలంటేనే వందలకోట్ల ఖర్చుతో కూడుకున్నవి. ఓప్రయోగం నిర్వహించిన తర్వాత వాహకనౌక దగ్గర నుంచి విడిభాగాల వరకూ అన్ని నిరుపయోగమవుతాయి. అంటే మరోసారి ప్రయోగం చేయాలంటే... నూతన పరికరాలు వాడాల్సిందే. వాటికి మళ్లీ కొత్తగా కోట్ల రూపాయలు వ్యయం చేయాల్సిన పరిస్థితి ఉంది.అయితే .. ఈ ప్రయోగాలు విజయవంతం చేయడం ద్వారా ... ఓసారి వాడిన పరికరాలను పునర్ వినియోగం చేయవచ్చు. అంటే సగానికి పైగా ఖర్చు తగ్గే అవకాశముంది. ఫలితంగా తక్కువ ధరకు ప్రయోగాలు నిర్వహించవచ్చు. అంటే అంతరిక్ష రంగంలో ఇస్రోకు మరింత వెసులుబాటు కలగనుందని చెప్పవచ్చు.

RLV-TD యొక్క కాన్ఫిగరేషన్ విమానం మాదిరిగానే ఉంటుంది మరియు లాంచ్ వెహికల్స్ మరియు ఎయిర్‌క్రాఫ్ట్ రెండింటి సంక్లిష్టతను మిళితం చేస్తుంది. రెక్కలు గల RLV-TD అనేది హైపర్‌సోనిక్ ఫ్లైట్, అటానమస్ ల్యాండింగ్ మరియు పవర్డ్ క్రూయిజ్ ఫ్లైట్ వంటి వివిధ సాంకేతికతలను అంచనా వేయడానికి ఫ్లయింగ్ టెస్ట్ బెడ్‌గా పనిచేసేలా కాన్ఫిగర్ చేయబడింది. ప్రస్తుతం ప్రపంచంలో పునర్వినియోగ అంతరిక్ష విమానం ఉన్న దేశాలు రెండు మాత్రమే. అయితే ఇవి మానవ రహిత డ్రోన్ విమానాలు, ఉపగ్రహాలను మోహరించే మరియు సాంప్రదాయ రాకెట్ నుండి ప్రయోగించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :