ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

కెనడాలో కాల్పులు.. భారత విద్యార్థి మృతి

కెనడాలో కాల్పులు.. భారత విద్యార్థి మృతి

కెనడాలోని వాంకోవర్‌లో చిరాగ్‌ అంటిల్‌ (24) అనే భారతీయ విద్యార్థి హత్యకు గురయ్యాడు. అతడు కారులో ఉండగా దుండగులు కాల్పులు జరిపినట్లు సమాచారం. విద్యార్థి మృతి విషయాన్ని సౌత్‌ వాంకోవర్‌ పోలీసులు వెల్లడిరచారు. కాల్పుల శబ్దం వినిపించినట్లు ఈ నెల 12న రాత్రి 11 గంటల సమయంలో స్థానిక పోలీసులకు సమాచారం వచ్చింది. ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించగా, కారులో చిరాగ్‌ విగత జీవిగా పడి ఉన్నాడు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఎవర్నీ అరెస్టు చేయలేదు అని వాంకోవర్‌ పోలీసులు ప్రకటించారు. చిరాగ్‌ హరియాణాకు చెందిన వ్యక్తి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :