ASBL NSL Infratech

ప్రపంచంలోనే భారత్ ది నాలుగోస్థానం

ప్రపంచంలోనే భారత్ ది నాలుగోస్థానం

ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్‌ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. 91,600 కోట్ల డాలర్ల వ్యయంతో అమెరికా ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా, రెండో స్థానంలో చైనా, మూడో స్థానంలో రష్యా నిలిచాయి. స్టాక్‌హోం అంతర్జాతీయ శాంతి పరిశోధక కేంద్రం (సిప్రి) తాజాగా ఈ మేరకు నివేదిక విడుదల చేసింది. నిరుడు ప్రపంచవ్యాప్తంగా రక్షణ వ్యయం 2,44,300 కోట్ల డాలర్లుగా ఉందని అందులో తెలిపిది. 2022తో పోలిస్తే ఆ మొత్తం 6.8 శాతం అధికమని పేర్కొంది. 2009 తర్వాత ఒక ఏడాదిలో రక్షణ వ్యయం ఇంత ఎక్కువ శాతం పెరగడం ఇదే తొలిసారి. వరుసగా తొమ్మిదో ఏడాది ఈ వ్యయంలో పెరుగుదల నమోదైంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :