ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

గూగుల్ మ్యాప్ కొత్త ఫీచర్

గూగుల్ మ్యాప్ కొత్త ఫీచర్

రూట్‌ తెలుసుకోవటం, షార్ట్‌కట్‌ల మర్గాలతో పాటూ రియల్‌టైమ్‌ లొకేషన్‌ షేరింగ్‌ వంటి సదుపాయాలన్ని గూగుల్‌ మ్యాప్స్‌ అందిస్తోంది. అయితే ఈ రియల్‌టైమ్‌ లొకేషన్‌ ఇతరులకు పంపించాలంటే కచ్చితంగా వాట్సాప్‌ లాంటి మరో యాప్‌పై ఆధారపడాల్సి ఉంటుంది. ఇలాంటి సమస్యలకు చెక్‌ పెడుతూ గూగుల్‌ మ్యాప్స్‌ కొత్త ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని సాయంతో ఏ ఇతర యాప్స్‌తో పనిలేకుండా కేవలం సాధారణ మెసేజ్‌ ద్వారా రియల్‌టైమ్‌ లొకేషన్‌ పంపొచ్చు. వాట్సాప్‌ ద్వారా రియల్‌టైమ్‌ మెసేజ్‌ పంపే సదుపాయం ఉన్నప్పటికీ 15 నిమిషాలు, గంట, 8 గంటలు ఇలా లిమిటెడ్‌ ఆప్షన్లు మాత్రమే ఉంటాయి. ఈ కొత్త ఫీచర్‌ సాయంతో పంపే లొకేషన్‌కు లిమిట్‌ ఉండదు. ఎంత సేపైనా ఆది ఆన్‌లోనే ఉంటుంది. మనం వద్దనుకున్నప్పుడు వెంటనే షేరింగ్‌ ఆపొచ్చు. ఆండ్రాయిడ్‌ ఫోన్‌ వినియోగిస్తున్నా చాలా మంది వాట్సాప్‌ లాంటి యాప్స్‌ని వినియోగించరు. అలాంటి వారికి ఈ సదుపాయం ఉపయోగపడుతుంది. అయితే ఈ ఫీచర్‌ని వినియోగించాలంటే మీరు లొకేషన్‌ పంపాలనుకున్న వ్యక్తి కూడా గూగుల్‌ మ్యాప్స్‌ యాప్‌లో లాగిన్‌ అయ్యిండాలి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :