ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

అహో అనిపించిన గ్లోబల్‌ తెలంగాణ అసోసియేషన్‌ సద్దుల బతుకమ్మ - దసరా సంబరాలు

అహో అనిపించిన గ్లోబల్‌ తెలంగాణ అసోసియేషన్‌ సద్దుల బతుకమ్మ - దసరా సంబరాలు

గ్లోబల్‌ తెలంగాణ అసోసియేషన్‌(జిటిఎ) వాషింగ్టన్‌ డీసీ వారు అక్టోబర్‌ 22 ఆదివారం రోజున బ్రాడ్‌ రన్‌ హైస్కూల్‌లో నిర్వహించిన మొదటి సద్దుల బతుకమ్మ-దసరా సంబరాలు నభూతో నభవిష్యత్తు అనేలా ఇంతకుముందు వాషింగ్టన్‌ డీసీ బతుకమ్మ చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా జరిగింది. అధిక సంఖ్యలో మహిళలు, పురుషులు మరియు పిల్లలు సుమారు 5000 మంది వరకు పాల్గోని సద్దుల బతుకమ్మ మరియు దసరా వేడుకలను ఘనంగా విజయవంతం చేసారు. జిటిఎ సంస్థ చైర్మన్‌, గ్లోబల్‌ ఉపాధ్యక్షులు, బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌, వాషింగ్టన్‌ డీసీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సెక్రెటరి, జాయింట్‌ సెక్రెటరి, ఎగ్జిక్యూటివ్‌ కమిటి, కమిటి చైర్స్‌ - కో-చైర్స్‌ కలిసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.

జిటిఎ సంస్థ వాషింగ్టన్‌ డీసీ అధ్యక్షులు తిరుమల్‌ మునుకుంట్ల సారధ్యంలో పెద్ద బతుకమ్మలతో సుమారు 200 పైగా బతుకమ్మలను తెలంగాణ ఆడపడుచులు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే బతుకమ్మ పండుగ కనుక మహిళలు, రాజకీయ నాయకులు, సంస్థ నిర్వాహాకులు అధిక సంఖ్యలో పాల్గొని డోలు డప్పులతో మరియు పోతురాజు విన్యాసాలతో ఊరేగింపుగా తీసుకరావటం జరిగింది. బెస్ట్‌ బతుకమ్మలకు బంగారు బహుమతులు మరియు పట్టు చీరలు, కిడ్స్‌ ఫ్యాన్సీ డ్రెస్‌ పోటీలు, కోలాటం జానపద నృత్యాలు, డ్యాన్స్‌ పోటీలు, గౌరి మరియు జమ్మి పూజ నిర్వహించారు. స్థానిక రెస్టారెంట్‌ కంట్రీ ఓవెన్‌ అధినేత శ్రవణ్‌ పాడూరు సారధ్యంలో వర్జీనియాలో వున్న ప్రముఖ రెస్టారెంట్స్‌ పారడైజ్‌ ఇండియన్‌ కుసిన్‌, ఉడ్‌ లాండ్స్‌, కాకతీయ కిచెన్‌, తవ ఫ్రై,పేస్ట్రి కార్నర్‌ మరియు హైదరాబాద్‌ బిర్యాని పాట్‌, వంటివి కూడా తమ వంతు సహాయంగా పాల్గొని ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 3:00 సుమారు 5000 అతిథులకు ఉచితంగా పసందైన భోజన కార్యక్రమం నిర్వహించారు.

జయ తేలుకుంట్ల, ప్రత్యూష నరపరాజు, మాధురి గట్టుపల్లి, లక్ష్మి బుయ్యాని, నీరజ సామిడి, సంకీర్త ముక్క, శ్రుతి సూదిని, రష్మి కట్పల్లి, షర్మిల మేకల, సింధూర పల్రెడ్డి,  సత్య బానొత్‌, సంధ్య కే, అనిత బండి, సుస్మిత జువ్వాడి, దీపిక వనమాల, మీన కలికోట, జనత కంచర్ల, స్వర్ణ వీర్ల, జలజ ముద్దసాని, అనుపమ దోమ, స్వప్న కరివేడ, ప్రీతి రాచర్ల, అనూష గుండ, రaాన్సి జోగు, రేవతి ముంద్రాతి, దివ్య అవ్వారు, శ్వేత వంగల, సమత తెల్లపెల్లి, ప్రసన్న కోమటిరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

గ్లోబల్‌ తెలంగాణా అసోసియేషన్‌ (జిటిఎ)సంస్థ చైర్మన్‌ విశ్వేశ్వర కలువల, ఉపాధ్యక్షులు శ్రవణ్‌ పాడూరు, ట్రెజరర్‌ సుధీర్‌ ముద్దసాని, బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీ సమరేంద్ర నంది, సంపత్‌ దేశినేని మరియు సత్యజిత్‌ మారెడ్డి, స్టాండింగ్‌ కమిటి చైర్‌ శ్రీకాంత్‌ పొట్టిగారి మరియు ఇంటెర్నేషనల్‌ కో-ఆర్డినేటర్‌ నర్సి దోమ, వాషింగ్టన్‌ డీసీ అధ్యక్షులు తిరుమల్‌ మునుకుంట్ల, ఉపాధ్యక్షులు ప్రవీణ్‌ పల్రెడ్డి, కోట్య బానోత్‌, క్రిష్ణకాంత్‌ కుచలకంటి, కిరణ్‌ ఉట్కూరి మరియు రాము ముండ్రాతి, సెక్రెటరి శ్రీధర్‌ బండి, రఘు జువ్వాడి. ఎగ్జిక్యూటివ్‌ కమిటి టీం సంతోష్‌ సోమిరెడ్డి, శ్రీనివాస్‌ రెడ్డి బోబ్బా, వినోద్‌ పల్లె, శశి యాదవ్‌, కిరణ్‌ తెల్లపల్లి, అజయ్‌ కుండీకుఫుల్ల, అమర్‌ అతికం, వెంకట్‌ దండ, దేవేందర్‌ మండల, రఘు పాల్రెడ్డి, సతీష్‌ చింతకుంట, తరుణ్‌ పొట్టిగారి, డా.సుమన్‌ మంచిరెడ్డి, శ్రీని జూపల్లి, మీడియా చైర్‌ ఈశ్వర్‌ బండ, మధు యనగంటి, ప్రవీణ్‌ ఆలెటి, కమలాకర్‌ నల్లాల, వెంకట్‌  చిలంపల్లి, క్రిష్ణ రమావత్‌, కిరణ్‌ బైరెడ్డి, ప్రసాద్‌ కంచర్ల, వేణు కే, శ్రీధర్‌ పాడురి, భాస్కర్‌ చల్ల, రఘువీర్‌, కిరణ్‌ వి, శ్రవంత్‌ గుండా, రాఘవేందర్‌ బుయ్యాని, రఘు జూలకంటి, సంతోష్‌ కుమార్‌, అనిల్‌ నక్క, వెంకట్‌ మందడి, చారుహాసిని గోకరాజు, నవీన్‌ హరి, జయచంద్ర చెరుకూరి, గణేష్‌ ముక్క, సునీల్ కుడికాల, వికాస్ ఉల్లి తదితరులు ఈ వేడుక విజయవంతానికి కృషి చేశారు. 

గ్లోబల్‌ తెలంగాణా అసోసియేషన్‌ సంస్థ చైర్మన్‌ విశ్వేశ్వర కలువల, ఉపాధ్యక్షులు శ్రవణ్‌ పాడూరు, వాషింగ్టన్‌ డీసీ అధ్యక్షులు తిరుమల్‌ మునుకుంట్ల మాట్లాడుతూ జిటిఎ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ ఆడపడుచులు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే మొదటి సద్దుల బతుకమ్మ-దసరా సంబరాలను ఇంత గొప్పగా విజయవంతం చేసినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు.

 

Click here for Event Gallery

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :