మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై మరో దావా

మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై మరో దావా

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోమారు చిక్కుల్లో పడ్డారు. అసలే అడ్డూ అదుపూ లేకుండా మాట్లాడే ట్రంప్‌ ఇటీవల కోర్టు తీర్పు అనంతరం కూడా నోరు పారేసుకున్నారు. ఎల్‌ అనే పత్రికలో సలహాల శీర్షిక నిర్వహించే ఇ.జీన్‌ కెరోల్‌ అనే రచయిత్రి తనపై ట్రంప్‌ 1996లో మాన్‌హటన్‌ ప్రాంతంలోని ఓ డిపార్ట్‌మెంట్‌ స్టోరులో లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపించిన విషయం తెలిసిందే.  ట్రంప్‌ చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలతో తన ఉద్యోగం ఊడిపోయిందని కూడా ఆమె తెలిపారు.  జీన్‌ కెరోల్‌పై ట్రంప్‌ లైంగిక దాడికి పాల్పడింది వాస్తవమేనంటూ రెండు వారాల క్రితం 9 మంది సభ్యుల జ్యూరీ నిర్ణయించి, ఆమెకు 50 లక్షల డాలర్ల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ తీర్పు తరవాత ట్రంప్‌ మాట్లాడుతూ కెరోల్‌ పరువుకు నష్టం కలిగించేలా మళ్లీ వ్యాఖ్యలు చేశారు. కెరోల్‌ మాటలు బోగస్‌ అని విమర్శించారు. దీనిపై కెరోల్‌ కోటి డాలర్లకు కొత్తగా మరో పరువు నష్టం దావా వేశారు. 

 

 

praneet obili-garuda AHA poulomi Png-jewelry aurobindo MUPPA
Tags :