ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఐవాలో డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారం... తన మద్దతుదారులకు

ఐవాలో డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారం... తన మద్దతుదారులకు

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యవహార శైలి చాలా భిన్నంగా ఉంటుంది. ఆయన ఏం చేసినా ఏం మాట్లాడినా డిఫరెంట్‌గా ఉంటుంది. తాజాగా ఐవాలో అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా తన మద్దతుదారులకు పిజ్జాలు పంచారు. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి అప్పుడే అమెరికాలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. 2024 అమెరికా అధ్యక్ష పదవి కోసం డొనాల్డ్‌ ట్రంప్‌ విస్తృతంగా ప్రచారం చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఆయన ఐవాలోని బెటెన్‌ డార్ప్‌లోని ఓ బార్‌లో తన మద్దతుతారులకు పిజ్జాలు పంచారు. అనంతరం అభిమానుల బిల్లులు, క్యాప్‌లు, టీషర్టులపై ఆటోగ్రాఫ్‌ ఇచ్చారు. వీడియోలో ట్రంప్‌ పిజ్జాలు ఎవరికీ కావాలంటూ ఉత్సాహంగా అనే పాట పాడుతూ తన అభిమానులకు పిజ్జాలు అందించారు. ఈ ఏడాదిలో ట్రంప్‌ ఏడు సార్లు ఐవాను సందర్శించారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :