ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

రూ.250తో బ్లాక్ బ‌స్ట‌ర్ ట్యూన్

రూ.250తో బ్లాక్ బ‌స్ట‌ర్ ట్యూన్

టాలీవుడ్‌లో సంగీత ద‌ర్శ‌కుల కొర‌త స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ప్ర‌తీసారీ ప‌క్క ఇండస్ట్రీ నుంచి ఎవ‌రొక‌రిని తెచ్చుకోవ‌డం త‌ప్ప ఇక్క‌డి టాలెంట్ మాత్రం స‌రిపోవ‌ట్లేదు. కొంద‌రు టాలెంటెడ్ ప‌ర్స‌న్స్ ఉన్నా వాళ్ల‌కు స‌రైన గుర్తింపు ద‌క్కట్లేదు. రీసెంట్‌గా మొన్న వాల్తేరు వీర‌య్య ప్రీ రిలీజ్‌లో దేవీ శ్రీ ఎమోష‌న‌ల్ అయిన తీరు చూశాక సంగీత ప్రియుల్లో ర‌క‌ర‌కాల డౌట్లు వ‌చ్చేశాయి.

లైవ్ లో చిరంజీవి ముందు దేవీ శ్రీ చాలా ఎమోష‌న‌ల్ అయ్యాడు. సంగీత సృజ‌న గురించి దేవీ క్లాస్ తీసుకున్నాడు. అంతేకాదు, తాను ట్యూన్ ఎలా క్రియేట్ చేస్తాడో కూడా స్టేజ్ పైనే చేసి చూపించి, త‌న టాలెంట్‌తో అంద‌రితో శ‌భాష్ అనిపించుకున్నాడు.

అస‌లు మ‌న మ్యూజిక్‌లో క్రియేటివిటీ ఉందా అని సందేహిస్తున్న వాళ్ల‌కు దేవీ శ్రీ ఇలా ప్రాక్టిక‌ల్‌గా స్టేజ్‌పైనే ఆన్స‌ర్ ఇవ్వాలనుకోవ‌డం ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. త‌న మ‌సులోని మాట‌ను కూడా చాలా స్ట్రాంగ్‌గా చెప్పాడు దేవీ. మ్యూజిక్ అనేది ఇన్‌స్ట్రుమెంట్‌లో ఉండ‌దు. మ‌న గుండెలో ఉంటుంది. మ‌న మ‌న‌సులోంచి బ‌య‌టికొస్తే సంగీతం అంటూ దేవీ స్టేజ్‌పై ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు.

బూర మ్యూజిక్‌తో త‌న‌లోని టాలెంట్‌ను బ‌య‌ట‌పెట్టాడు దేవీ. అప్ప‌టి వ‌ర‌కూ ఎంతో ఎన‌ర్జిటిక్‌గా డ్యాన్సులు చేస్తూ పాట‌లు పాడుతూ అల‌రించిన దేవీ మ్యూజిక్‌పై స‌డెన్ గా స్పీచ్ ఇవ్వ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. త‌న చేతిలో ఉన్న ప‌చ్చ‌బూర‌ను అంద‌రికీ చూపిస్తూ దాని గురించి ఇంట్రెస్టింగ్ మ్యాట‌ర్ ఒక‌టి చెప్పాడు. ఏ ఊరు వెళ్లినా అక్క‌డ ఓ మ్యూజ‌క్ ఇన్‌స్ట్రుమెంట్ కొంటుంటాన‌ని, అలా రీసెంట్‌గా గోవా వెళ్లిన‌ప్పుడు ఈ బూర కొన్నాన‌ని, కేవ‌లం రూ.250కే ఈ బూర కొన్నాన‌ని, దీంతో ఏం చేయొచ్చో అని ఆలోచించి, దానిపై ప్ర‌యోగాలు చేస్తే పూన‌కాలు లోడింగ్ సాంగ్ వ‌చ్చింద‌ని దేవీ తెలిపాడు.

అయితే ఆ రోజు దేవీ శ్రీ కౌంట‌ర్ ఎవ‌రినుద్దేశించి అన్న‌ది మాత్రం గెస్ చేయ‌లేక‌పోయారు. కానీ ఈవెంట్‌లో అత‌డు విసిరిని ప్ర‌తి పంచ్ త‌గ‌లాల్సిన చోట త‌గిలింద‌ని ఇప్పుడు గుస‌గుస వినిపిస్తోంది. సంగీతం అంటే కాపీ పేస్ట్‌లే కాద‌ని దేవీ చెప్పాడు. స్టేజ్ పై దేవ చేసిన ఈ లైవ్ పెర్ఫామెన్స్, బూర నుంచి సంగీతం పుట్టించిన విధానం అంద‌రినీ ఆక‌ట్టుకుంది. మొత్తానికి దేవీ 250 రూపాయల‌తో సూప‌ర్ సాంగ్ ట్యూన్ క‌ట్టాడు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :