ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

బ్రిటన్ వీసా నిబంధనలు మరింత కఠినం

బ్రిటన్ వీసా నిబంధనలు మరింత కఠినం

బ్రిటన్‌ ప్రభుత్వం వలసలను అడ్డుకునేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్యామిలీ వీసా నిబంధనలను మరింత కఠినతరం చేసింది. బ్రిటిష్‌ పౌరులు శాశ్వత నివాసితులు తమ బంధువులను కుటుంబ వీసాపై తీసుకురావాలనుకుంటే అందుకు ప్రస్తుతం ఉన్న నిబంధనలను కఠినతరం చేసింది. అందుకు కనీస వేతన పరిమితిని 55 శాతం పెంచింది. దీనిపై గత సంవత్సరమే యూకే ప్రభుత్వం ప్రకటన చేసింది. ఈ నిబంధనలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఇక నుంచి ఎవరైనా కుటుంబ వీసాకు స్పాన్సర్‌ చేయాలంటే వారి కనీస వార్షిక వేతనం 29,000 జీబీపీలుగా ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో ఈ పరిమితి 18,600 జీబీపీలుగా ఉంది. వచ్చే సంవత్సరం నుంచి వృత్తి నిపుణుల వీసా నిబంధనలతో  సమానంగా కుటుంబ వీసా వేత పరిమితిని 38,7000 జీబీపీలకు పెంచనున్నట్లు అధికారులు తెలిపారు.  దేశంలోకి వలసలు విపరీతంగా పెరుగుతున్నందున ఇంతకంటే సులభమైన పరిష్కారం మరోకటి కనిపించలేదని బ్రిటన్‌ హోంమంత్రి జేమ్స్‌  క్లేవర్లీ తెలిపారు.

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :