ASBL NSL Infratech

బోయ‌పాటి వెంట ప‌డుతున్న రానా?

బోయ‌పాటి వెంట ప‌డుతున్న రానా?

టాలీవుడ్ టాలెంటెడ్ న‌టుడు రానా విరాట ప‌ర్వం సినిమా చేసి చాలా కాల‌మ‌వుతున్నా, ఆ సినిమా త‌ర్వాత మ‌రో సినిమా చేసింది లేదు. విరాట‌ప‌ర్వం ప్ర‌మోష‌న్స్ టైమ్‌లో త‌న రూట్ మార్చుతాన‌ని, ప్ర‌యోగాల‌కు దూరంగా, క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కు ద‌గ్గ‌ర‌గా ఉంటాన‌ని మాటిచ్చాడు. రానా త‌ను చెప్పిన మాట మీద అయితే ఉన్నాడు కానీ ఇప్ప‌టివ‌ర‌కు ఏ ద‌ర్శ‌కుడు త‌న‌ని, ఇంప్రెస్ చేసే క‌థ‌తో రాలేదు. 

విరాట‌ప‌ర్వం రిలీజ్ అయి ఆరు నెల‌లు గ‌డుస్తున్నా ఇప్ప‌టివ‌ర‌కు రానా నుంచి కొత్త సినిమా అప్డేట్ మాత్రం రాలేదు. మ‌రి ఈ డిలేకి రీజ‌నేంటి? అంటే రానాకు ఇంకా స‌రైన స్టోరీ దొర‌క‌క‌పోవ‌డ‌మే అని తెలుస్తోంది. అస‌లు విషయానికొస్తే, టాలీవుడ్ లో క‌మ‌ర్షియ‌ల్ స్టోరీల‌కు అస‌లు కొద‌వేలేదు. మ‌న రైట‌ర్లంతా ఆ టైప్ స్టోరీలు రాయ‌డంలో బెస్ట్. అయినా స‌రే రానాకు ఇప్ప‌టివ‌ర‌కు స్టోరీ దొర‌క్క‌పోవ‌డం ఆశ్చ‌ర్యంగానే ఉంది. 

ఇంకా చెప్పాలంటే ఒక‌ప్పుడు క‌మ‌ర్షియ‌ల్ స్టోరీల‌తో హిట్లు అందించిన వారంతా ఇప్పుడు సినిమాల్లేక ఖాళీగానే ఉంటున్నారు. మంచి ట్రాక్ లో ఉన్న వారంతా పాన్ ఇండియా ఫిల్మ్స్ అంటూ అటు వైపు వెళ్తున్నారు. దీంతో ఇక లాభం లేద‌నుకున్న రానా, క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కు పెట్టింది పేరు అనే బోయ‌పాటిని రంగంలోకి దించడానికి ట్రై చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. 

ఇప్పుడు ఉన్న‌వాళ్ల‌లో బోయ‌పాటి అయితేనే త‌న‌కు బెస్ట్ అనుకున్న రానా, బోయ‌పాటితోనే త‌న సినిమాకు ప్లాన్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే రానా ఇప్పుడు బోయ‌పాటి వెంట ప‌డుతున్న‌ట్లు ఇన్ సైడ్ టాక్. రీసెంట్‌గానే బోయ‌పాటిని క‌లిసి స‌రైన స్టోరీ ఉంటే చెప్పండి సినిమా చేద్దామ‌ని రానా ఆఫ‌ర్ చేశాడ‌ని, దానికి బోయ‌పాటి కూడా త‌ప్ప‌కుండా చేద్దామన్న‌ట్లు చెప్పిన‌ట్లు తెలుస్తోంది. 

ప్ర‌స్తుతం రామ్‌తో బోయ‌పాటి ఓ పాన్ ఇండియ‌న్ ఫిల్మ్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ఆ సినిమా కొంత భాగం షూటింగ్ కూడా అయిపోయింది. బ్యాలెన్స్ షూటింగ్ కూడా పూర్తైతే బోయ‌పాటికి టైమ్ దొర‌కుతుంది. రామ్ సినిమా త‌ర్వాత బోయ‌పాటి ఎవ‌రికీ క‌మిట్‌మెంట్ ఇచ్చింది కూడా లేదు కాబ‌ట్టి రానా వేసిన ప్లాన్ వ‌ర్కవుట్ అయ్యే ఛాన్సుంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :