సూపర్ స్టార్ రజనీకాంత్ కు గవర్నర్ పదవి?

సూపర్ స్టార్ రజనీకాంత్ కు గవర్నర్ పదవి?

2024 లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడు నుంచి గణనీయ స్థానాలు సాధించడమే లక్ష్యంగా వ్యూహం రచించిన బీజేపీ ఆ మేరకు రజనీని రంగంలోకి దింపుతోందని విశ్వసనీయంగా తెలిసింది. ఇందులో భాగంగానే ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజకు ఇప్పటికే రాజ్యసభ సభ్యత్వం ఇచ్చింది. తాజాగా తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ను తమ సొంతం చేసుకునే పనిలో ఉంది కాషాయదళం. ఇందుకోసం ఆయనకు గవర్నర్‌ పదవి కట్టబెట్టాలని భావిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. గతంలో రాజకీయాల్లోకి వచ్చేందుకు ముచ్చటపడిన రజనీకాంత్‌, ఆఖరి నిమిషంలో వెనక్కి తగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల 75వ స్వాతంత్య్ర దినోత్సవంలో పాల్గొన్న రజనీ, ఢల్లీిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తదితరులు భేటీ అయ్యారు. అయితే రజనీకి గరవ్నర్‌ పదవి కట్టబెట్టాలని ప్రధాని మోదీ భావిస్తున్నట్లు తెలిసింది. మోదీతో రజనీకి చిరకాల స్నేహం ఉంది. గతంలో మోదీ చెన్నై వచ్చినప్పుడు రజనీ నివాసాని వెళ్లి చాలాసేపు ఆ కుటుంబంతో సరదాగా గడిపారు. ఈ సాన్నిహిత్యం కూడా రజనీని బీజేపీకి చేరువ  చేస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో బీజేపీ నుంచి వచ్చిన ఆఫర్‌కు రజనీ కూడా సానుకూలత వ్యక్తం చేసినట్లు సమాచారం.

 

Tags :