రివ్యూ : పరవాలేదనిపించే 'భోళాశంకర్'
తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2.5/5
నిర్మాణ సంస్థలు : ఏ కె ఎంటర్టైన్మెంట్, క్రియేటివ్ కమర్సియల్స్
నటీనటులు: చిరంజీవి, తమన్నా భాటియా, కీర్తి సురేష్, సుశాంత్, రఘు బాబు, మురళీ శర్మ, తరుణ్ అరోరా,
సాయాజీ షిండే, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, రష్మీ గౌతమ్, శ్రీ ముఖి, రఘు బాబు, బిత్తిరి సత్తి, సత్య,
హైపర్ ఆది, గెటప్ శ్రీను, ఉత్తేజ్, షవర్ అలీ, అతిధి పాత్రలో బ్రహ్మానందం తదితరులు
సంగీతం: మహతి స్వర సాగర్, సినిమాటోగ్రఫీ: డడ్లీ, ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్
పాటలు : రామ్ జోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్,మెహర్ రమేష్, ఫెరోజ్ ఇస్రేల్,
కథ : శివ, ఆది నారాయణ (మూలం వేదాళం 2015)
మాటలు : మామిడాల తిరుపతి
నిర్మాతలు: రామబ్రహ్మం సుంకర, అనిల్ సుంకర, అజయ్ సుంకర, కె.ఏస్.రామా రావు
దర్శకుడు : మెహర్ రమేష్
విడుదల తేదీ : 11.08.2023
ఈ ఏడాది 'వాల్తేర్ వీరయ్య' సక్సెస్ తో యంగ్ హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా పోటా పోటీగా సినిమాలు చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. తమిళ్ లో అజిత్ హీరోగా 2015 లో వచ్చిన సక్సెస్ మూవీ 'వేదాళం' దీనికి రీమేక్ గా తెలుగు లో చిన్న మార్పులతో మెగాస్టార్ చిరంజీవి హీరోగా, కీర్తి సురేష్ చెల్లెలిగా తెరకెక్కించారు మెహర్ రమేష్. ఏ కె ఎంటర్టైన్మెంట్, క్రియేటివ్ కమర్సియల్స్ సంయుక్తంగా నిర్మించిన 'భోళాశంకర్' ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. మరి చిరంజీవి చెల్లెలి సెంటిమెంట్ వర్కౌట్ అయ్యిందా? ప్రేక్షకులు ఏ మేరకు రిసీవ్ చేసుకున్నారో సమీక్షలో చూద్దాం!
కథ:
శంకర్ (చిరంజీవి) తన చెల్లి మహాలక్ష్మి (కీర్తి సురేష్)తో కలిసి బ్రతుకుతెరువు కోసం కోలకతా దిగుతారు. తాను టాక్సీ డ్రైవర్ గా జీవితాన్ని మొదలెడతాడు. మహాలక్ష్మి చూసి శ్రీ కార్ (సుశాంత్) ప్రేమలో పడతాడు. వారిద్దరికీ పెళ్లి చేయాలని అనుకుంటాడు శంకర్. అయితే, సిటీలో అలెగ్జాన్దర్ (తరుణ్ అరోరా) మాఫియా గ్యాంగ్ వరుసగా అమ్మాయిలను కిడ్నాప్ చేసి అమ్మెస్తూ ఉంటారు. ఈ అమ్మాయిల రవాణా ను మహాలక్ష్మి, క్రిమినల్ లాయర్ లాస్య (తమన్నా భాటియా) కళ్లారా చూస్తారు. వారిని పట్టుకోలేక పోలీసులు సతమతమవుతూ ఉంటారు. ఈ క్రమంలో జరిగిన నాటకీయ పరిణామాల నేపథ్యంలో శంకర్ ఆ మాఫియాని టార్గెట్ చేస్తాడు.అసలు శంకర్ ఆ మాఫియాని ఎందుకు టార్గెట్ చేశాడు?, గతంలో ఆ మాఫియాతో శంకర్ కి ఉన్న సంబంధం ఏమిటి ?, చివరకు శంకర్ ఆ మాఫియాని అంతం చేశాడా ?, లేదా ? అనేది మిగిలిన కథ.
నటీనటుల హావభావాలు:
మెగాస్టార్ చిరంజీవి కామెడీ టైమింగ్ తో పాటు కథలోని మెయిన్ కోర్ ఎమోషన్ కూడా బాగుంది. అలాగే మెగాస్టార్ పాత్రలోని షేడ్స్ ను, తమన్నాతో సాగే సీన్స్ ను మరియు ప్లాష్ బ్యాక్ ను.. ఆ ప్లాష్ బ్యాక్ లోని ఎమోషనల్ సీక్వెన్సెస్ సినిమాకి ప్లస్ అయ్యాయి. ముఖ్యంగా మెగాస్టార్ పాత్రలోని ఎలివేషన్ సన్నివేశాలు విశేషంగా అలరిస్తాయి. రఫ్ అండ్ మాస్ అవతార్ లో మెగాస్టార్ అద్భుతంగా నటించారు. ఇక చెల్లి పాత్రకు కీర్తి సురేష్ ప్రాణం పోశారు. ఆమె పాత్ర వల్లే అక్కడక్కడా భావోద్వేగాలు పండాయి. నటనకు మంచి స్కోప్ వున్నా పాత్ర ఆమెకు లభించింది. మరో క్రిమినల్ లాయర్ లాస్య గా తమన్నా పాటలకు తప్పిస్తే.. పాత్ర పరంగా పెద్దగా ప్రాధాన్యత లేదు. అతిధి క్యారెక్టర్ లో సుశాంత్ కూడా బాగానే నటించాడు. కీలక పాత్రలో నటించిన మురళీశర్మ పెర్ఫార్మెన్స్ చాలా సెటిల్డ్ గా చాలా బాగుంది. శ్రీముఖి కి చెప్పుకోతగ్గ క్యారెక్టర్ పడింది. ఆమె అందంతో పాటు నటన కూడా మెప్పించింది. రఘు బాబు, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి మరియు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
సాంకేతికవర్గం పనితీరు:
భోళాశంకర్ సినిమాకి రచనా పరంగా మెగాస్టార్ రేంజ్ కి తూగలేకపోయిందని చెప్పొచ్చు. కథా, కథనాలు ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టుగానే వస్తుంటాయి. దర్శకుడు మెహర్ రమేష్ టేకింగ్ బాగుంది. అయితే, మంచి కంటెంట్ రాసుకోవడంలో విఫలం అయ్యారు. ఆయన రాసిన స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్ గా లేదు. కొత్తదనం అనేది ఎక్కడా కనపడదు. సంగీత దర్శకుడు మహతి స్వర సాగర్ అందించిన సంగీతం పర్వాలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం కొన్ని కీలక సన్నివేశాల్లో అదరగొట్టాడు. డడ్లీ సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది. ఇక ఎడిటర్ ఎడిటింగ్ వర్క్ కూడా పర్వాలేదు. నిర్మాణ పరంగా ఎక్కడా తక్కువ చేయలేదు నిర్మాతలు.
విశ్లేషణ:
భోళాశంకర్ అంటూ వచ్చిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎమోషనల్ డ్రామా కొన్ని చోట్ల మాత్రమే ఆకట్టుకుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి గ్రేస్ అండ్ ఇమేజ్ సినిమాకి ప్లస్ అయ్యాయి. కానీ, ఫస్ట్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ కావడం, కొన్ని చోట్ల స్లో నేరేషన్ వుండటం ప్రేక్షకుడికి ఇబ్బందిగా అనిపిస్తుంది. పైగా ఈ చిత్రం కథ సినీ ప్రేమికుడికి ముందుగా తెలుసు కాబట్టి సినిమా చూస్తున్నంతసేపు థ్రిల్ గా ఫీల్ అవలేదు. పోరాట ఘట్టాలు, పాటలు ఒకదానివెనుక ఒకటి వస్తుంటాయి దాని వల్ల ప్రేక్షకుడు రొటీన్ సినిమారా బాబు అనుకుంటాడు. ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ సినిమాను నిలబెట్టింది. ఓవరాల్ గా ఈ సినిమాలో మెగాస్టార్ నటన, కొన్ని యాక్షన్ ఎలిమెంట్స్, భావోద్వేగ సన్నివేశాలు ఆకట్టుకున్నా..పూర్తి స్థాయి లో సినిమా మాత్రం మెప్పించలేకపోయింది. మెగా ఫ్యాన్స్ కు ఈ సినిమా ఎంటర్టైన్ చేస్తుంది.