ASBL NSL Infratech

అరబిందో ఫార్మా యాంటీ ఫంగల్ కు.. అమెరికాలో

అరబిందో ఫార్మా యాంటీ ఫంగల్ కు.. అమెరికాలో

తీవ్రమైన ఫంగల్‌ ఇన్ఫెక్షన్లకు చికిత్సలో వినియోగించే పోసకానజోల్‌ ఇంజెక్షన్‌ను అమెరికా విక్రయించడానికి అరబిందో ఫార్మా అనుమతి సంపాదించింది. తన అనుబంధ సంస్థ అయిన యూగియా ఫార్మా స్పెషాలిటీస్‌ లిమిటెడ్‌ ఈ మందును 300 ఎంజీ/16.7 ఎంఎల్‌ సింగిల్‌ డోస్‌ వయల్‌ రూపంలో విక్రయించడానికి  అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్‌ఎఫ్‌డీఏ) నుంచి అనుమతి పొందినట్లు అరబిందో ఫార్మా వివరించింది. వెంటనే దీన్ని యూఎస్‌ మార్కెట్లో విడుదల చేయనున్నట్లు వెల్లడిరచింది. ఈ మందు మెర్క్‌కు చెందిన నాగ్జాఫిల్‌  ఇంజెక్షన్‌కు జనరిక్‌ ఔషదం. యూఎస్‌ మార్కెట్లో గత ఏడాది కాలంలో 25.4 మిలియన్‌ డాలర్ల అమ్మకాలను ఈ మందు నమోదు చేసింది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :