ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

మద్యం, గంజాయి, డ్రగ్స్.. దిగజారుతున్న ఏపీ ఇమేజ్..!

మద్యం, గంజాయి, డ్రగ్స్.. దిగజారుతున్న ఏపీ ఇమేజ్..!

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం అభివృద్ధి, సంక్షేమం లాంటి విషయాలను కాదని మద్యం, గంజాయి, డ్రగ్స్ చుట్టూ తిరుగుతోంది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అన్నింటా అగ్రగామిగా ఉండేది. దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ చుట్టూ చూసేది. ఏదైనా సంస్కరణలు అమలు చేయాలన్నా, కొత్త పరిశ్రమలు రావాలన్నా ఏపీ ముందుండేది. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు రాజధాని కూడా లేదంటూ ఎద్దేవా చేసే వాళ్లే ఎక్కువైపోయారు. రాష్ట్రమంటే పక్కరాష్ట్రాల్లో చిన్నచూపు చూస్తున్నారంటూ చాలా మంది బాధపడుతున్నారు. సోషల్ మీడియాలో ఆంధ్రప్రదేశ్ పై ట్రోలింగ్స్ కూడా విపరీతంగా జరుగుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో మద్యనిషేధం అమలు చేస్తామని హామీ ఇచ్చారు వైఎస్ జగన్. అయితే ఆ హామీని అమలు చేయలేకపోయారు. మద్యం ధరలను పెంచడం ద్వారా దాన్ని అరికట్టేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పుకొచ్చారు. మద్యం అమ్మకాలను ప్రైవేటు వ్యక్తుల నుంచి స్వాధీనం చేసుకుని ప్రభుత్వమే అమ్మడం మొదలు పెట్టింది. అయితే అప్పటి నుంచి ప్రధాన బ్రాండ్లు దొరకట్లేదని.. ఊరూపేరూ తెలియని బ్రాండ్లు మాత్రమే అమ్ముతున్నారనే విమర్శలు మొదలయ్యాయి. ఆ బ్రాండ్లన్నీ కల్తీవని.. అధికార పార్టీ నేతల కంపెనీల నుంచే అవి ఉత్పత్తి అవుతున్నాయనే ఆరోపణలు వచ్చాయి. ఏపీ మద్యం బ్రాండ్లపై జరుగుతున్న ట్రోలింగ్స్ అన్నీ ఇన్నీ కావు.

ఇక గంజాయి పేరెత్తితే దానికి కేరాఫ్ అడ్రస్ ఆంధ్రా అనే పేరు వినిపిస్తోంది. దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా దాని మూలాలు మాత్రం ఏపీలోనే ఉంటున్నాయి. తెలంగాణలో గంజాయి పట్టుబడితే దాన్ని శోధించుకుంటూ వెళ్లిన పోలీసులకు విశాఖ మన్యంలో మూలాలు బయటపడ్డాయి. ఇప్పటికీ గంజాయి అక్రమ రవాణా విచ్చలవిడిగా సాగుతోంది. పోలీసులు ఎంత ప్రయత్నిస్తున్నా గంజాయిని అరికట్టడంలో మాత్రం విఫలమవుతున్నారు. అయితే కొంతమంది నాయకులు, ఉన్నతాధికారుల ప్రమేయం ఉండడం వల్లే గంజాయి అక్రమ రవాణా యధేచ్ఛగా సాగుతోందనే విమర్శలున్నాయి.

ఇన్నాళ్లూ ఏపీకి, డ్రగ్స్ కి పెద్దగా సంబంధాలుండేవి కాదు. అయితే ఇప్పుడు డ్రగ్స్ కూడా ఏపీ చుట్టూ తిరుగుతున్నాయి. ఆ మధ్య గుజరాత్ లో డ్రగ్స్ పట్టుబడితే దాని మూలాలు విజయవాడకు చెందిన ఓ కంపెనీలో బయటపడ్డాయి. ఇప్పుడు బ్రెజిల్ నుంచి వచ్చిన ఓ కంటైనర్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం పలు అనుమానాలకు తావిస్తోంది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు పలు అంశాలపై వార్తల్లో నిలుస్తోంది. ఇవన్నీ అసాంఘీక అంశాలే కావడం బాధాకరం. 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :