ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

డల్లాస్ వేదికగా అక్కినేని-ఆకృతి జాతీయ పురస్కారం

డల్లాస్ వేదికగా అక్కినేని-ఆకృతి జాతీయ పురస్కారం

డా.అక్కినేని శతజయంతి సందర్భంగా అమెరికాలోని డల్లాస్‌ వేదికగా నటసామ్రాట్‌ అక్కినేని-ఆకృతి జాతీయ పురస్కార కార్యక్రమాన్ని ఈ నెల 19వ తేదీన జరుపనున్నామని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంంలో తానా పూర్వ అధ్యక్షులు, అక్కినేని ఫౌండేషన్‌ ఆఫ్‌ అమెరికా వ్యవస్థాపక అధ్యక్షుడు డా.ప్రసాద్‌ తోటకూరకు నటసామ్రాట్‌ అక్కినేని-ఆకృతి జాతీయ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నామని పేర్కొన్నారు. ఈ పురస్కార కార్యక్రమంలో ప్రముఖ సాహితీ వేత్త, పద్మశ్రీ కొలకలూరి ఇనాక్‌ ముఖ్య అతిథిగా పాల్గొని పురస్కారాన్ని అందించనున్నారు. ఈ కార్యక్రమంలో అమెరికాలో తెలుగు వారు, తెలుగు సాహితీవేత్తలు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :