ASBL NSL Infratech

సినిమాలైతే ఓకే చేశాడు.. సెట్స్ పైకి ఆలస్యంగానే!

సినిమాలైతే ఓకే చేశాడు.. సెట్స్ పైకి ఆలస్యంగానే!

అక్కినేని అఖిల్ హీరోగా వ‌స్తున్న తాజా చిత్రం ఏజెంట్. సురేంద‌ర్ రెడ్డి డైరెక్ష‌న్ లో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో మ‌మ్ముట్టి కీల‌క పాత్ర చేస్తున్నారు. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా అనేక కార‌ణాల వ‌ల్ల అనేక సార్లు వాయిదా ప‌డుతూ వ‌స్తుంది. ఎట్ట‌కేల‌కు ఈ సమ్మ‌ర్‌కు సినిమా రిలీజ్ అన్నారు. కానీ ఈ స‌మ్మ‌ర్‌కు అయినా ఏజెంట్ థియేట‌ర్ల‌కు వ‌స్తాడా లేదా అని మొన్న వ‌ర‌కు డౌట్లున్నాయి. 

కానీ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింద‌ని, కేవ‌లం ప్యాచ్ వ‌ర్క్ మాత్ర‌మే బ్యాలెన్స్ ఉంద‌ని ఏజెంట్ టీమ్ చెప్పుకొస్తుంది. ఏజెంట్ ఇంకా రిలీజ్ కూడా కాలేదు, దీనికి ముందే అఖిల్ మ‌రో రెండు సినిమాల‌ను లైన్‌లో పెట్టేశాడు. అందులో ఒక‌టి కేజీఎఫ్, కాంతార లాంటి సూప‌ర్ హిట్స్ అందించిన హోంబ‌లే ఫిల్మ్స్, యువీ క్రియేష‌న్స్ తీస్తున్న సినిమాల‌ను అఖిల్ ఓకే చేసిన‌ట్లు తెలుస్తోంది. 

అయితే ఏజెంట్ రిలీజ్ అయ్యాక మాత్ర‌మే అఖిల్ ఈ ప్రాజెక్టుల‌ను ప‌ట్టాలెక్కించే ఛాన్స్ ఉంది. వీటికి సంబంధించిన వివ‌రాలు కూడా అఖిల్ ఏజెంట్ రిలీజ్ త‌ర్వాతే అనౌన్స్ చేస్తాడ‌ని స‌న్నిహిత వ‌ర్గాలు చెప్తున్నాయి. ప్ర‌స్తుతం అఖిల్ ఏజెంట్‌తోనే ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈసినిమా కోసం అఖిల్ త‌న బాడీని పూర్తిగా పెంచాడు. 

హెయిర్, గ‌డ్డం పెంచి ర‌గ్డ్ లుక్‌లో ఉన్న అఖిల్ ప‌క్కా మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఈ సినిమా అయిపోతే కానీ అఖిల్ ఈ లుక్ నుంచి బ‌య‌ట‌కు రాలేడు. ఈ సినిమా అయిపోయాక మ‌ళ్లీ త‌న బాడీని క‌థ‌కు త‌గ్గ‌ట్లుగా సెట్ చేసుకుని ఆ త‌ర్వాత సెట్స్ కు వెళ్లాలి. దీనికి కాస్త టైమ్ ప‌ట్టే అవ‌కాశాలున్నాయి. ఇదిలా ఉంటే ఏజెంట్ డిజిట‌ల్ రైట్స్‌ను సోనీ లివ్ భారీ ధ‌ర‌కు కొనుగోలు చేసినట్లు స‌మాచారం.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :