ASBL NSL Infratech

త్వరలో రూ.10ల ప్లాస్టిక్ నోట్లు

త్వరలో రూ.10ల ప్లాస్టిక్ నోట్లు

కొత్త పదిరూపాయల నోట్లని ప్లాస్టిక్‌తో రూపొందించి, ప్రయోగాత్మక పరిశీలనకు  వీలుగా క్షేత్రస్థాయిలో వినియోగానికి కేంద్ర ప్రభుత్వం రిజర్వుబ్యాంకుకు అనుమతులిచ్చింది. ఈ మేరకు లోక్‌సభలో కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌ సభ్యులకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. కాగితం స్థానంలో ప్లాస్టిక్‌ వినియోగం వల్ల నోట్లు ఎక్కువకాలం మన్నే ఆస్కారం ఉందన్న సూచనలు పరిగణనలోనికి తీసుకుంటూ, ప్రపంచవ్యాప్తంగా వినియోగంలో ఉన్న ప్లాస్టిక్‌ నోట్లద్వారా నోట్ల జీవితకాలాన్ని పెంచుకుంటున్న విషయంపై వివరాలు చేసుకుని, తగిన ప్లాస్టిక్‌ మిశ్రమాలతో సరికొత్త 10 రూపాయల నోటు రూపకల్పనకు ఆర్బీఐకి అనుమతిచ్చినట్లు వివరించారు.  ఆర్బీఐ తీసుకున్న ఈ ప్లాస్టిక్‌ పది రూపాయలను ప్రయోగాత్మకంగా దేశంలోని 5 ప్రాంతాలలో వినియోగంలోనికి తేనున్నట్లు మంత్రి తెలిపారు.

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :