ASBL NSL Infratech

అమెరికాకు తగ్గుతున్న విదేశీ విద్యార్థులు

అమెరికాకు తగ్గుతున్న విదేశీ విద్యార్థులు

అమెరికా కళాశాలలకు విదేశీ విద్యార్థుల దరఖాస్తులు తగ్గుతున్నాయని ఓ సర్వే తెలిపింది. అమెరికాలోని దాదాపు 40 శాతం కళాశాలల్లో విదేశీ విద్యార్థులు దరఖాస్తులు తగ్గినట్లు అమెరికన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ కాలేజియేట్‌ రిజిస్టార్స్‌ నిర్వహించిన సర్వేలో తేలింది. ముఖ్యంగా పశ్చిమాసియా దేశాల నుంచి  దరఖాస్తులు బాగా తగ్గాయని వెల్లడించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఆయన వలస విధానాల గురించి విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు అమెరికా వెళ్లడానికి భయపడుతున్నారని తెలుస్తోంది.

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :