ASBL NSL Infratech

కర్నూలు జిల్లా ఎర్రగుడి వద్ద రైతులతో వైయస్ జగన్ ముఖాముఖి

కర్నూలు జిల్లా ఎర్రగుడి వద్ద రైతులతో  వైయస్ జగన్ ముఖాముఖి

తొమ్మిది గంటల ఉచిత విద్యుత్, ప్రతి రైతుకు 12,500 ఇవ్వటం వల్ల రైతు ఉత్పత్తి వ్యయం పూర్తిగా తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి రైతు భరోసా అని పేరు పెట్టామన్నారు. రైతు పంట అమ్ముకునేటప్పుడు రైతన్నకు గిట్టుబాటు ధరలు రాకపోవటం.. అప్పుడు రైతన్నలు నష్టపోయే పరిస్థితి వస్తోంది. రైతన్నకూ తోడుగా ఉండేందుకు ప్రయత్నిస్తాం. మనకు చంద్రబాబులా షాపులు లేవు. దళారీ వ్యవస్థ తీసేందుక ప్రయత్నిస్తాం. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం. ప్రతి రైతుకు పంట వేసే ముందు దాని ధర నిర్ణయిస్తామని తక్కువకే అమ్ముకోవాల్సి వస్తే పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. దీనివల్ల రైతన్నకు భరోసా కలుగుతుందన్నారు. 

పంట వేసిన తర్వాత అకాల వర్షాలు వచ్చి.. కరువు వచ్చి నష్టపోతే ఇన్ పుట్ సబ్సిడీ ఎగగొట్టే పరిస్థితి ఉందన్నారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కెనామిటీ రిలీఫ్ ఫండ్ రూ.2వేల కోట్లు పెట్టుబడి పెడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం మరో 2వేల కోట్లు ఇస్తుందన్నారు. దీనివల్ల కరువు, అకాల వర్షాల వల్ల రైతన్న నష్టపోకుండా కాపాడుతుందన్నారు. 

జ‌ల‌య‌జ్ఞం ద్వారా ప్రతి పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేసి రైతుకు తోడుగా ఉంటామన్నారు. ఇదే విషయాన్ని నవరత్నాల్లో చెప్పాం. దీనికన్నా మెరుగైన మంచి ఆలోచనలు, సూచనలు ఇవ్వాలని రైతన్నలను శ్రీ వైయస్ జగన్ కోరారు. మార్పులు-చేర్పులు ఉంటే చెప్పామని శ్రీ జగన్ సూచించారు. 

అప్పిరెడ్డి, నంద్యాల, రైతు- కేసీ కెనాల్ కింద మూడు వేల కి.మీ. ఉంది. దీన్ని లైనింగ్ వేశారు. 3వేల క్యూసెక్కులు పారేది. ఇప్పుడు 1500 క్యూసెక్కులు రావటం కష్టంగా ఉంది. శ్రీశైలంలో నీళ్లు ఉంచితే ఎస్ఆర్బీసీ ఇతర మార్గాల ద్వారా నీరు వస్తాయన్నారు. నీళ్లు రాబోయే ముందు కట్టలు ఎలా ఉన్నాయో చూడాలని కోరారు. ఎస్ఆర్బీసీ వదలగానే కట్టలు తెగి రైతులు నష్టపోయారు. ముందుగానే కాల్వలు బాగున్నాయా, చక్కలు బాగున్నాయా అన్నది చూడాలన్నారు. వైయస్ఆర్ హయాంలో ఒక్క రైతు కూడా కాల్వ కట్ట మీదకు ఎక్కి నీళ్లు కావాలని అడగలేదు.నాకు ఈ రేటు కావాలని అడగలేదు. ఆ మహానుభావుడు అడక్కముందే అన్నీ తీర్చారు. మా దురద)ష్టం ఏమిటి అంటే.. ఆ మహానుభావుడు లేకపోవటమే అన్నారు. మహాభారతంలో పాండు రాజు, ధ)తరాష్ట్రుడులో ఎవరిని రాజు చేయాలన్న దానిపై చర్చలు జరిగి రాజు అన్నవాడికి శరీరానికి లోపం ఉండరాదన్న నిర్ణయం తీసుకున్నారని .. అలాంటి పరిస్థితి ఉంటే రాజ్యానికి మంచిది కాదని పెద్దలు చెప్పారని ముగించారు. 

రామక్రిష్ణ, రైతు-- నకిలీ విత్తనాల వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. దీనిపై శ్రీ వైయస్ జగన్ కలగజేసుకుంటూ.. సాక్షాత్తూ ఇందులో ముఖ్యమంత్రి, స్పీకర్ పేర్లు వినిపిస్తున్నాయని పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అవుతున్నాయన్నారు. పత్తి కొనుగోళ్లలో స్కాంలు జరుగుతున్నాయన్నారు. చివరికి ఈ విషయం పత్తిపాటి పుల్లారావు అక్కడ నుంచి నారా లోకేశ్ దగ్గరకు వెళ్తోందన్నారు. ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉందన్నారు. ఇంత దారుణం జరుగుతుంటే ఎవరికి చెప్పకోవాలన్నారు. 

దీనిపై సమగ్రమైన చట్టాలు తీసుకువస్తామన్నారు. దీన్ని కట్టడి చేసే కార్యక్రమం చాలా సీరియస్ గా తీసుకుంటామని శ్రీ జగన్ హామీ ఇచ్చారు. 

చంద్రమౌళి, పేదంచర్ల: కల్తీ విత్తనాలు, మందులపై నాదొక చిన్న సలహా. ప్రభుత్వం నకిలీ, కల్తీ సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నష్టపోతున్న రైతులకు భరోసా కలిగించాలన్నారు. దీనిపై స్పందించిన శ్రీ జగన్ వైయస్ఆర్ భరోసా పేరుతో బీమా పథకానికి శ్రీకారం చుడతామన్నారు. రైతన్న వ్యక్తి చనిపోతే తన కుటుంబం అయినా బావుండాలని ఆశిస్తారు. రైతులు చనిపోతే, ఆత్మహత్యలు చేసుకుంటే.. అప్పులు వాళ్లు ఆ కుటుంబం జోలికి అప్పులు వాళ్లు వెళ్లకుండా చర్యలు తీసుకుంటానని శ్రీ జగన్ తెలిపారు. ఆ రకమైన చట్టం తీసుకువచ్చి.. ఆ కుటుంబాన్ని వేధింపుల నుంచి ఆదుకుంటానన్నారు. ప్రభుత్వం నుంచి వైయస్ఆర్ బీమా తీసుకువచ్చి రూ.5 లక్షలు కూడా ఆ కుటుంబంలో భార్యకే ఇస్తామన్నారు. కనీసం ఆ కుటుంబం ఆడబ్బుతో ముందుకువెళ్లేందుకు తీడ్పాటు ఇస్తామన్నారు.

వెంకటప్ప అనే రైతు మాట్లాడుతూ.. 60వేలు రుణమాఫీ కాలేదన్నారు. మీరు ముఖ్యమంత్రి అయ్యాక నాకు ఖచ్చితంగా సాయం చేస్తారని కోరుకుంటున్నానన్నారు.

వెంకటేశ్వర్లు.. అనే వ్యక్తి మాట్లాడుతూ.. మా ఇంట్లో అమ్మకు కూడా ఇంతవరకు రుణమాఫీ కాలేదన్నారు. ఇన్ ఫుట్ సబ్సిడీ పేరుతో టీడీపీ కార్యకర్తలు తినేశారని అన్నారు. నువ్వు వైయస్ఆర్ సీపీ కార్యకర్తవు .. నీకు కాదు అని.. దిక్కున్న చోట చెప్పుకో పో అన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

శివనాగిరెడ్డి--కర్నూలులో 42 ఏళ్లుగా ఉంటున్నాను. నెల రోజుల నుంచి నీళ్లు తాగలేని పరిస్థితి ఉందన్నారు. సమ్మర్ స్టోరేజీ లేదని, తుంగభద్ర నీటిని ఎత్తుకువెళ్తున్నారని అన్నారు. 130 టీఎంసీలకు పైగా వాడుకోవచ్చని రిజర్వాయర్లు లేవన్నారు. వరదలప్పుడు మాత్రమే కేసీ కెనాల్ నీళ్లు వస్తున్నాయన్నారు. తుంగభద్ర నుంచి ఆత్మకూరు వరకు సమాంతర కాల్వ కట్టాలని వరద నీటిని ఈ ప్రాంతంలో చెరువులకు మళ్లిస్తే సస్యశ్యామలం అవుతుందన్నారు. ఇది గుండ్రేవుల కన్నా పైనుంచి మొదలు పెట్టాలని శ్రీ జగన్ ఈ సందర్భంగా తెలిపారు. 

సుభాష్ రెడ్డి, రైతు-- హంద్రీనీవా నుంచి నీళ్లు వస్తే.. మా ఇళ్లలో వైయస్ఆర్ ఫొటో పెట్టుకుంటామన్నారు. వైయస్ఆర్ ను గుండెల్లో పెట్టుకున్నట్లే మిమ్మల్నీ పెట్టుంటామని అన్నారు. వైయస్ఆర్ పంచె కట్టుకున్నట్లు మీరు కట్టుకోవాలని కోరారు. ఈ సందర్భంగా శ్రీ జగన్ కల్పించుకుంటూ.. వయస్సు పెరిగితే తప్పకుండా పంచె కట్టుకుంటానని శ్రీ జగన్ అన్నారు.

- ఎం.వీ.ఎస్.నాగిరెడ్డి, వైయస్ఆర్ సీపీ రైతు విభాగం అధ్యక్షుడు

రాష్ట్రంలో కర్నూలు జిల్లా అత్యధిక సాగు భూమి ఉన్న జిల్లా. తూ.గో., ప.గో. సాగు జరిగే దానికన్నా కర్నూలు జిల్లాలో జరుగుతుందన్నారు. రాష్ట్రంలో అన్ని పంటలు అత్యధికంగా పండించేంది కర్నూలు జిల్లా మాత్రమే. వ్యవసాయంలో జీడీపీ పెరగాలంటే.. కర్నూలు జిల్లా నుంచే మొదలవ్వాలి. పశ్చిమ కర్నూలులో పంటలు దెబ్బతిన్నాయని ఈనాడులో కథనం ప్రచురితం అయిందన్నారు. కేంద్ర మద్దతు ధరలు కూడా రైతులను ఆదుకోవటం లేదన్నారు. స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం ఉత్పత్తి కంటే 50శాతం అదనంగా ఇవ్వాలి. కేంద్రం ధాన్యం కంటే గోధుమకు ఎక్కువ మద్దతు ధర ప్రకటిస్తే చంద్రబాబు కనీసం లేఖ కూడా రాయలేదన్నారు.

పోతిరెడ్డి నుంచి 44 వేల క్యూసెక్కుల నీరు వచ్చినప్పుడు మాత్రమే ఈ ప్రాంతంలో అన్ని ప్రాజెక్టులకు నీరు వస్తుందన్నారు. శ్రీ జగన్ గారు అధికారంలోకి రాగానే అన్ని పెండింగ్ ప్రాజెక్టులు, అడ్మినిస్ట్రేటివ్ అనుమతులు పొందిన వాటినీ పూర్తి చేస్తారన్నారు. వ్యవసాయం విషయంలో శ్రీ జగన్ గారికి ఉన్న ప‌రిజ్ఞానం అద్భుతమన్నారు. వ్యవసాయంపై, రైతు సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తి శ్రీ జగన్ ముఖ్యమంత్రి అయితే రైతులకు మంచి జరుగుతుందన్నారు. ప్రక)తిపై.. వైయస్ కుటుంబానికి ప్రేమ ఉందన్నారు. 80 లక్షల రైతుల అకౌంట్లలో మేలో రూ.12, 500 శ్రీ జగన్ ప్రతి ఏటా ఇస్తామన్నారు. రైతులను బాబు చేస్తున్న మోసంపై నాగిరెడ్డి నిలదీశారు.

Click here for Photogallery

 

Tags :