ASBL Koncept Ambience
facebook whatsapp X

మహిళా యూనివర్సిటీ వద్ద చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని పై దాడి..

మహిళా యూనివర్సిటీ వద్ద చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని పై దాడి..

ఆంధ్రాలో నిన్న జరిగిన పోలింగ్ హై టెన్షన్ మధ్య ముగిసిన విషయం అందరికీ తెలిసిందే. పలు ప్రాంతాలలో ఉత్కంఠ పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పోలింగ్ తర్వాత ఉద్రిక్తతలు చల్లారడం లేదు సరి కదా మరింత రాజుకుంటున్నాయి. ఈరోజు చంద్రగిరి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై సాయంత్రం పద్మావతి మహిళా యూనివర్సిటీ ప్రాంగణంలో దాడి జరిగింది. తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఈవీఎం స్ట్రాంగ్ రూమును పరిశీలించడానికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో పులివర్తి నాని పై ఈ దాడి జరిగింది.

ఈ దాడిలో నాని భద్రతా సిబ్బందికి గాయాలు తగిలాయి. పులివర్తి నాని స్పృహ తప్పి పడిపోవడం టీడీపీ శ్రేణులను మరింత కలవరపాటుకు గురిచేసింది. దాడిలో ఆయన ప్రయాణిస్తున్న కారు తీవ్రంగా ధ్వంసం అయింది. ఈ నేపథ్యంలో దాడిని నిరసిస్తూ పులివర్తి నానితో పాటు ఆయన అనుచరులు పద్మావతి యూనివర్సిటీ రోడ్డుపై బైఠాయించారు. ఈ దాడిలో సుమారు 150 మంది వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు అని తెలుస్తోంది. దాడి చేయడానికి వచ్చిన వారి వద్ద కత్తులు, గొడ్డలితో పాటు కర్రలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మహిళా యూనివర్సిటీ రణరంగంగా మారింది. భారీ సంఖ్యలో పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితులను అదుపులోకి తీసుకు వచ్చారు.



praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :