ASBL NSL Infratech

2019లో జగన్ కు రాజయోగం

2019లో జగన్ కు రాజయోగం

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి జాతకంలో 2018 అక్టోబరు 25 నాటికి శని మహాదశ పూర్తయి, సమస్యలు తొలగుతాయని వేదపండితులు పేర్కొన్నారు. 2019లో ఆయన రాజయోగం పట్టనుందని, ఎన్నికల్లో 135 సీట్లు గెలుచుకుని, మే నెలలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు. అప్పటి నుంచి 12 సంవత్సరాల 18 నెలలు, 18 రోజుల ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతారన్నారు. వైజ్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంను మరింపిచేలా జగన్‌ పాలన ఉంటుందన్నారు. గుంటూరు జిల్లా కాకుమానులో జగన్మోహన్‌రెడ్డి ఉగాది వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా తాడేపల్లిగూడేనికి చెందిన వేదపండితులు పి.శివరామకృష్ణశర్మ పంచాంగ శ్రవణం చేస్తూ జగన్‌ మున్ముందు జాతకాన్ని వివరించారు.

Tags :