ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

నాణ్యత... నమ్మకమే త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌ విజయం

నాణ్యత... నమ్మకమే  త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌ విజయం

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగంలో 2007 నుంచి త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌ ప్రయాణం ప్రారంభమైంది. కంపెనీలోని డైనమిక్‌ టీమ్‌, మంచి విజనరీ ఉన్న యాజమాన్యం ఉండటంతో అనతికాలం లోనే కంపెనీ దాదాపు 12కుపైగా రెసిడెన్షియల్‌ వెంచర్స్‌ను హైదరాబాద్‌ దాని పరిసర ప్రాంతాల్లో పూర్తి చేసింది. దాదాపు 1 మిలియన్‌ స్క్వేర్‌ఫీట్‌ బిల్ట్‌ అప్‌ ఏరియాలో నిర్మాణాలను పూర్తి చేసింది. 2 మిలియన్‌ స్క్వేర్‌ ఫీట్‌ ఆఫ్‌ బిల్ట్‌ అప్‌ ఏరియాలో పనులను చేస్తోంది. సుధాకర్‌ పసుపులేటి దూరదృష్టి, పనితీరు, ఆర్టిటెక్చరల్‌ ఎక్స్‌పీరియన్స్‌, నిజాయితీ, నిబద్దత వల్ల కంపెనీ అన్నీచోట్లా విజయాలను అందుకుంటోంది. కన్‌స్ట్రక్షన్స్‌ పనుల తోనూ, మరోవైపు ధార్మిక, సామాజికసేవా కార్యక్రమాలతో సుధాకర్‌ పనిచేస్తున్నారు. సుధాకర్‌ వల్ల దాదాపు 500 త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌ కుటుంబాలు నేడు హ్యాపీగా కనిపిస్తున్నాయి.

హైదరాబాద్‌లోని బౌరాంపేటలో గేటెడ్‌ కమ్యూనిటీకోసం ల్యాండ్‌మార్క్‌ 1 పేరుతో లగ్జరీ విల్లాలను కంపెనీ నిర్మించింది. 2,3 బెడ్‌రూమ్‌లను ఇందులో నిర్మించి కస్టమర్లకు అందించింది. త్రిపుల ల్యాండ్‌మార్క్‌ 2 పేరుతో మరో ప్రాజెక్టు అదే ప్రాంతంలోనే నిర్మించింది. దాదాపు 13.5 ఎకరాల్లో నిర్మించిన ఈ?ప్రాజెక్టులో 231 లగ్జరీ డ్యూప్లెక్‌ విల్లాస్‌ను ఇందులో నిర్మించి ఇచ్చింది. త్రిపుర మేనర్‌ పేరుతో రెసిడెన్షియల్‌ అపార్ట్‌మెంట్‌ను అల్కాపురిలో నిర్మించింది. మణికొండలో నల్లగొండ టవర్స్‌ పేరుతో అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్స్‌ను నిర్మించింది. దాదాపు 5 ఫ్లోర్‌లతో 20 ప్రీమియర్‌ 2, 3 బెడ్‌రూమ్‌ అపార్ట్‌మెంట్‌లు ఇందులో ఉన్నాయి. అత్యాధునిక సౌకర్యాలను ఇందులో కల్పించారు. శ్రీ బాలాజీ రెసిడెన్సీస్‌ పేరుతో మణికొండలో 2,3 బెడ్‌రూమ్‌ అపార్టుమెంట్స్‌ను నిర్మించింది. 2 బెడ్‌రూమ్‌ 1200స్క్వేర్‌ఫీట్‌తో, 3 బెడ్‌రూమ్‌ 1600స్క్వేర్‌ఫీట్‌తో నిర్మించారు. ఇందులో కూడా అన్నీ సౌకర్యాలను కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా కల్పించారు. త్రిపుర మిడోస్‌ పేరుతో తెల్లాపూర్‌లో విల్లాలను నిర్మించారు. విశాలమైన ఓపెన్‌స్పేస్‌తో 1690 ఫీట్‌లలో ఈ విల్లాలను నిర్మించారు.

త్రిపుర మిడోస్‌

తెల్లాపూర్‌లో త్రిపుర మిడోస్‌ పేరుతో డ్యూప్లెక్స్‌ విల్లాలను కంపెనీ నిర్మిస్తోంది. 10 డ్యూప్లెక్‌ విల్లాను అత్యాధునికమైన సౌకర్యాలతో, అందరికీ నచ్చేలా, విశాలమైన ప్రదేశంలో నిర్మిస్తోంది. లివింగ్‌ రూమ్‌, మాస్టర్‌ బెడ్‌రూమ్‌, బాల్కనీ, లాంజ్‌, చిల్డ్రన్స్‌ బెడ్‌రూమ్‌, గెస్ట్‌ బెడ్‌రూమ్‌, బాల్కనీ ఇలా ఎన్నో సదుపాయాలు ఇందులో ఉన్నాయి. 1690ఫీట్లలో ప్రతి విల్లా నిర్మితమవుతోంది. ఐటీ నిపుణులకు ఈ ప్రాంతం హాట్‌స్పాట్‌గా ఉంది. దీంతో వారిని ఆకట్టుకునేలా ఈ ప్రాజెక్టును కంపెనీ కడుతోంది.

త్రిపుర లాండ్‌మార్క్‌ 3

త్రిపుర లాండ్‌మార్క్‌ 3 పేరుతో బౌరాంపేట్‌లో గేటెడ్‌ కమ్యూనిటీకోసం?విల్లాల నిర్మాణాన్ని కంపెనీ చేపట్టింది. హైటెక్‌సిటీకి, ఓఆర్‌ఆర్‌కు మంచి కనెక్టివిటీ ఉన్న ప్లేస్‌లో ఈ?ప్రాజెక్టు ఏర్పాటవుతోంది. రెండంతస్తులతో ఈ విల్లాలను నిర్మిస్తున్నారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లో లివింగ్‌రూమ్‌, మాస్టర్‌ బెడ్‌రూమ్‌, కిచెన్‌ ఏరియా, పై అంతస్తులో చిల్డ్రన్స్‌ బెడ్‌రూమ్‌, గెస్ట్‌ బెడ్‌రూమ్‌, బాల్కనీ ఉంటుంది. ఇందులో ఇతర వసతులను కూడా కల్పించారు. జిమ్నాజియం, సిసికెమెరా, రౌండ్‌ ది క్లాక్‌ సెక్యూరిటీతోపాటు వందశాతం?వాస్తుతో ఈ ప్రాజెక్టు నిర్మితమవుతోంది.

త్రిపుర గ్యాలక్సీ

త్రిపుర గ్యాలక్సీ పేరుతో తెల్లాపూర్‌లో మరో ప్రాజెక్టును కంపెనీ నిర్మిస్తోంది. గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడకు దగ్గరలో ఈ రెసిడెన్షియల్‌ హబ్‌ను నిర్మిస్తున్నారు. గేటెడ్‌ కమ్యూనిటీని ఆకట్టుకునేలా 2,3 బెడ్‌రూమ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. 1430స్క్వేర్‌ఫీట్‌, 1210 స్క్వేర్‌ఫీట్‌లతో వీటిని నిర్మిస్తున్నారు. దాదాపు 107 అపార్టుమెంట్‌లను ఇందులో నిర్మిస్తున్నారు.  జిమ్నాజియం, సిసికెమెరా, రౌండ్‌ ది క్లాక్‌ సెక్యూరిటీతోపాటు వందశాతం?వాస్తుతో ఈ ప్రాజెక్టు నిర్మితమవుతోంది.

మరిన్ని కొత్త ప్రాజెక్టులను కూడా కంపెనీ చేపట్టనున్నది. గ్రీన్‌ అల్ఫా పేరుతో ఫారెస్ట్‌ థీమ్‌తో టౌన్‌షిప్‌ను తెల్లాపూర్‌లో ఏర్పాటు చేయనున్నది. 2,3 బెడ్‌రూమ్‌లతో వస్తున్న ఈ ప్రాజెక్టులో ప్రకృతి సహజసిద్ధమైన వనరుల మధ్య నివసించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రీన్‌ అల్ఫాకు తగినట్లుగానే ఈ ప్రాజెక్టు మొత్తం పచ్చని చెట్లతో కళకళలాడుతూ కనిపిస్తుంది.

త్రిపురల ల్యాండ్‌మార్క్‌4ను కూడా బౌరాంపేట్‌లో గేటెడ్‌ కమ్యూనిటీకోసం నిర్మించనున్నారు. ల్యాండ్‌మార్క్‌ సిరిసీలో నిర్మించే ఈ ప్రాజెక్టులో దాదాపు 500కుపైగా 3 బెడ్‌రూమ్‌ లగ్జరీ విల్లాలను నిర్మిస్తున్నారు. అన్నీ వసతులతో, అత్యాధునికమైన లైఫ్‌స్టయిల్‌తో ఈ ప్రాజెక్టు అందరినీ ఆకట్టుకునేలా తీర్చిదిద్దనున్నారు.

sales@tripuraconstructions.in


www.tripuraconstructions.com

 

Tags :