ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

సాహితీ సమావేశాల్లో పుస్తకాల ఆవిష్కరణ

సాహితీ సమావేశాల్లో పుస్తకాల ఆవిష్కరణ

వాషింగ్టన్‌డీసీలోని వాల్టర్‌ ఈ వాషింగ్టన్‌ కన్వెన్షన్‌ సెంటరులో 22వ తానా మహాసభల్లో ముగింపు రోజు అయిన శనివారం నాడు తెలుగు సాహిత్య సమావేశం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పలువురు రచయితల పుస్తకాలను ప్రముఖ సాహితీవేత్త పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌, తాళ్లూరి పంచాక్షరయ్య, తానా మాజీ అధ్యక్షుడు డా.జంపాల చౌదరిలు ముఖ్య అతిథులుగా హాజరై ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 9 పుస్తకాలను ఆవిష్కరించారు. తాళ్లూరి పంచాక్షరయ్య మాట్లాడుతూ తెలుగులోనే త ప్తి ఉందని, తనకు తెలుగు తప్ప వేరే భాష రాదని అందుకే తాను 90ఏళ్ల వయస్సులో ఇంత చలాకీగా ఉన్నానని చెప్పారు. యార్లగడ్డ మాట్లాడుతూ తెలుగు భాష తెలుగు రాష్ట్రాల్లో బలహీనపడుతుందేమో గానీ అమెరికాలో, విదేశాల్లో కాలర్‌ ఎగరేసుకుని వాషింగ్టన్‌ డీసీ పురవీధుల్లో పచార్లు చేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చివుకుల ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు. మేడసాని అవధానానికి భారీ స్పందన లభించింది.

Tags :