ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

టీడీఎఫ్ ఆధ్వరంలో ఘనంగా దసరా, బతుకమ్మ వేడుకలు

టీడీఎఫ్ ఆధ్వరంలో ఘనంగా దసరా, బతుకమ్మ వేడుకలు

అమెరికాలోని ఒరెగాన్‌ స్టేట్‌లో తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరమ్‌ (టీడీఎఫ్‌) ఫోర్టాండ్ల్‌ చాప్టర్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ మరియు దసరా వేడుకలు వైభోవోపేతంగా జరిగినవి. ఎంతో ఘనంగా జరిగి ఈ ఉత్సవాలకు ఫోర్టాండ్ల్‌ మెట్రో సిటీస్‌ నుంచి చాలా పెద్ద ఎత్తున ఎన్నారైలు తరలి వచ్చారు.

అత్యంత వైభవంగా జరిగిన ఈ వేడుకల్ని ఫోర్టాండ్ల్‌ చాఫర్‌ చైర్మన్‌ శ్రీని అనుమాండ్ల విగ్నేశ్వరుడికి పూజా చేసి, జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారి అమ్మాయిలు మరియు మహిళలు తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా సాంప్రదాయ దుస్తులు ధరించి, ఒకే చోట చేరి వివిద పాటలకు బతుకమ్మ ఆడారు. బతుకమ్మలను తీసుకొచ్చిన్న వారందరికీ మరియు పోటీలలో గెలిచిన వారికి శ్రీని అనుమాండ్ల బహుమతులని ప్రధానం చేశారు. ఆ తర్వాత బతుకమ్మలను వాలంటీర్లు సహాయంతో స్కూల్‌ ప్రాంగణంలోని కొలనులో నిమజ్జనం చేశారు.ఆ తర్వాత మహిళలు అందరూ గౌరమ్మ మరియు ప్రసాదాన్ని ఇచ్చి పుచ్చుకున్నారు. నిమజ్జనం తర్వాత, దసరా పండుగను జమ్మిచెట్టుకు ప్రత్యేక పూజ నిర్వహించి స్టార్ట్‌ చేసారు. పండుగకి వచ్చిన వారందరు జమ్మి (బంగారం)ని ఇచ్చి పుచ్చుకొని శుభాకాంక్షలు తెలుపుకొని పెద్ద వారితో ఆశీర్వాదం తీసుకొన్నారు. వేడుకలకి వచ్చినా వారందరికీ టీడీఎఫ్‌ టీం పసందైన భోజనం వడ్డిశారు.

ఈ సందర్భంగా శ్రీ అనుమాండ్ల వేడుకలకి వచ్చినా వారందరికీ బతుకమ్మ మరియు దాసరా శుభాకాంక్షలు తెలియచేసారు. బతుకమ్మ పండుగని ఇంత ఘనంగా జరుపుకోవడానికి సహకరించిన మహిళలందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ వేడుకని విజయవంతంగా నిర్వహించడానికి సహాయం చేసిన స్పాన్సర్స్‌కి శ్రీని కృతజ్ఞతలు తెలియజేశారు. భోజనము తర్వాత అతిథులందరూ కోలాటం, దాండియా ఆటతో ఎంజాయ్‌ చేశారు.

చివరగా ఈ వేడుకను విజయవంతం చేయడంలో ప్రముఖు పాత్ర వహించిన టీడీఎఫ్‌ చాప్టర్‌ టీం మెంబర్స్‌ నిరంజన్‌ కూర, నరెందర్‌ చీటి, భాను పోగుల, కొండల్‌ రెడ్డి పుర్మ, మధుకర్‌ రెడ్డి పురుమాండ్ల మరియు రాజ్‌ అందోల్‌ లకి శ్రీని అనుమాండ్ల ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ వెంట్‌ ప్రేపరేషన్‌ మరియు ఈవెంట్‌ రోజు కృషి చేసిన టీం మెంబర్స్‌ శ్రీనివాస్‌రెడ్డి పగిడి, రఘు శ్యామ, సురేష్‌ దొంతుల, జయాకర్‌ రెడ్డి ఆడ్ల, సత్య సింహరాజ, వీరేష్‌ బుక్క, అజయ్‌ అన్నమనేని, వెంకట్‌ ఇంజమ్‌, హరి సూదిరెడ్డి శ్రీని గుబ్బ, వెంకట్‌ గోగిరెడ్డి ఇతర వాలంటీర్స్‌ అందరిక హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

 

Tags :