ASBL NSL Infratech

వికారాబాద్ లో TTA సేవా కార్యక్రమాలు

వికారాబాద్ లో TTA సేవా కార్యక్రమాలు

TTA సేవా డేస్ కార్యక్రమంలో ఈరోజు TTA సభ్యులు  వికారాబాద్ లో తన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వికారాబాద్ మరియు పరిగి లలో TTA అధ్వర్యంలో దివ్యాంగులకు ఆర్టిఫీషియల్ దేహ భాగాల పంపిణీ, ట్రై సైకిల్ పంపిణీ, వీల్ చైర్స్ పంపిణీ, స్కూల్ బిల్డింగ్ డెవలప్ మెంట్. Dr. Vijayapal Reddy garu TTA Advisory Council Chair, Kavitha Reddy General Secretary TTA అధ్వర్యంలో జరుగుతున్నాయి. కార్యక్రమం సర్వీస్ పార్టనర్ లుగా రోటరీ క్లబ్ కమ్మం మరియు లయన్స్ క్లబ్ వికారాబాద్ వారు వ్యవహరిస్తున్నారు.

TTA ప్రసిడెంట్ వంశీ రెడ్డి మాట్లాడుతూ ఎన్నో కార్య్రమాలను ఇప్పటి వరకు చేశామని కానీ ఇది మా  హృదయానికి హత్తుకునే కార్యక్రమం అన్నారు...ఇంత మంది కాళ్ళు చేతులు లేని వారి జీవితాలు  మా TTA వల్ల కొంతలో కొంత మారడం మా అదృష్టం అని అన్నారు. మధు అనే రెండు కాళ్ళు చేతులు పోయిన ఒక చిన్న పిల్లవాని చూసి చెలించిన వంశీ జీవితంలో ఆ పిల్లవానికి అవసరమైన సహాయం చేస్తానని తెలిపారు.

Dr.Vijayapal Reddy garu TTA advisory council chair గారు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాల నిర్వహణ మాకు చాలా ఆనందం కలిగిస్తుందని...ఒక ఉద్యమంలా రానున్న రోజుల్లో వికారాబాద్, పరిగి ప్రాంతంలో ఉన్న దివ్యాంగులకూ రానున్న రెండు సంవత్సరాలలో 100శాతం మందికి వారికి అవసరమైన సహాయం TTA చేస్తుందని తెలిపారు.

కవితరెడ్డి TTA జనరల్ సెక్రటరీ మాట్లాడుతూ ఈరోజు మేము దాదాపు 100మందికి ట్రై సైకిల్, వీల్ చైర్స్, 70మందికి ఆర్టిఫీషియల్ దేహబాగాలు అందించడం జరుగుతుందని...ఈకార్యక్రమంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.

TTA అడ్వైసర్ కౌన్సిల్ చైర్ మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ TTA అమెరికాలో  చేసే సేవా కార్యక్రమాలు వివరించారు...  తెలంగాణలో ఉన్న దివ్యాంగులకు అందరికీ మేము సహాయం అందించే ప్రయత్నం చేస్తామని తెలిపారు.

దుర్గాప్రసాద్ గారు TTA నాయకులు మాట్లాడుతూ ఈ అవకాశం ఇచ్చిన దేవునికి ధన్యవాదాలు తెలిపారు.

సంతోష్ గారు TTA సేవా డేస్ కోఆర్డినేటర్ మాట్లాడుతూ త్వరలో చేయబోయే అన్ని కార్యక్రమాలకు తమ సహకారం ఉంటుందని తెలిపారు.

TTA మహిళా నాయకురాలు జ్యోతి రెడ్డి గారు మాట్లాడుతూ ఈ అద్భుతమైన సేవా కార్యక్రమాన్ని లీడ్ చేస్తున్న విజయపాల్ రెడ్డి గారికి కవిత రెడ్డి గారి కి మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు.

మనోహర్ TTA జాయింట్ ట్రెజరర్ గారు మాట్లాడుతూ మీడియా ప్రాధాన్యతని వివరించారు..

సంతోష్ గారు సర్వీస్ చైర్... మరియు సంగిత గారు TTA మహిళా నాయకురాలు మాట్లాడుతూ సేవా కార్యక్రమాల లో తమకు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

DR. ద్వారకానాద్ గారు ఇండియా కోఆర్డినేటర్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాల నిర్వహణ ప్రతి సంవత్సరం చేయాలని ఆశించారు.

నవీన్ పేరిక గారు కమ్యూనిటీ సర్వీస్ చైర్ మాట్లాడుతూ సేవా డేస్ కార్యక్రమాలను వివరించారు.

నవీన్ రెడ్డి మలిపెద్ది TTA ప్రసిడెంట్ ఎలెక్ట్ మాట్లాడుతూ ఈసారి నుండి ప్రతి సంవత్సరం ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు.

వినోద్ గారు TTA సభ్యులు మాట్లాడుతూ వచ్చే సంవత్సరం తప్పకుండా.  తన పుట్టిన గడ్డ లో సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తానని తెలిపారు.

శ్రీని సుందర్ రావు మరియు లవకుమర్ లయన్ గారు TTA సేవలను ప్రశంసించారు.

తదనంతర కార్యక్రమం పరిగి మడలం నారాయణపూర్ లక్ష్మీదేవి పల్లి గ్రామాలలో జరిగింది.

స్కూల్ అభివృధ్ది పనులు చేసి విద్య అభివృద్ధి కి సహకరించారు... గ్రామస్థులు పిల్లలు TTA బృందానికి డప్పు చెప్పులతో స్వాగతం పలికారు...మానవ హారం గా ఏర్పడి TTA బృందానికి పిల్లలు హర్షం వ్యక్తం చేశారు.

గ్రామీణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ గుమ్మడి కాయ తో పాటు కొబ్బరి కాయ లను కొట్టి  స్వాగతం పలికారు గ్రమవాసులు...తదనంతరం విజయపల్ రెడ్డి గారు రిబ్బన్ కట్ చేసిఅభివృద్ధి పనులను జాతికి అంకితం చేశారు.

కార్యక్రమంలో దాదాపు 5లక్ష్యల రూపాయలు స్కూల్  అభివృధ్ది పనులు చేయడం జరిగింది.

TTA ప్రసిడెంట్ వంశీ రెడ్డి మాట్లాడుతూ పిల్లలో పిల్లవాడి గా కలిసి పోయారు..వారితో థాంక్స్ యూ విజయ పాల్ రెడ్డి అనాలని పిల్లలను ఎంకరేజ్ చేశారు..

పాటశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ TTA సేవలను కొనియాడారు.

విజయ్ పాల్ రెడ్డి గారు మాట్లాడుతూ తన చిన్నతంలోనే నారాయణ్ పూర్ మరియు. లక్ష్మి దేవి పల్లి . గ్రామాలతో  అనుభందం ఏర్పడింది అని తెలిపారు..TTA నాయకత్వం ద్వారా వీలైనంత సహాయం ఈ గ్రామాలకు ఉంటుందని తెలిపారు.

కవిత రెడ్డి గారు మాట్లాడుతూ విద్యాదానం చేయడం మహోన్నతమైన విషయం...అని అన్నారు...స్కూల్ పిల్లల కోసం ఇక్కడికి రావడం చాలా ఆనందంగా వుంది అని అన్నారు.

TTA సభ్యులను శాలువాలతో సన్మానించి గ్రామ ప్రజలకు అనందం వ్యక్తం చేశారు.

సేవాడేస్ కార్యక్రమానికి కోఆర్డినేటర్ గా సురేష్ రెడ్డి వెంకన్నగారి గారు, INDIAN కోఆర్డినేటర్ గా డా. డి. ద్వారకనాథ రెడ్డి గారు, కో - కోర్డినేటర్ గా దుర్గా ప్రసాద్ సెలోజ్ గారు, ఫౌండేషన్ సర్వీస్ చైర్ గా సంతోష్ గంటారం గారు, ఇంటెర్నేషనల్ వైస్ ప్రసిడెంట్ గా ప్రసాద్ కునారపు గారు,హెల్త్ అండ్ వెల్నెస్ అడ్వైసర్ గా జ్యోతిరెడ్డి దూదిపాల గారు, నర్సింహా పెరుక గారు - కమ్యూనిటీ సర్వీసెస్ చైర్ గా, ప్రసిడెంట్ గా వంశిరెడ్డి కంచరకుంట్ల గారు మరియు ప్రసిడెంట్ ఎలెక్ట్ గా నవీన్ రెడ్డి మలిపెద్ది గారు, Kavitha Reddy - General Secretary గారు భాద్యతలు నిర్వహిస్తున్నారు.

మరియు TTA సభ్యులు సేవా డేస్ లో పాల్గొనడం జరిగింది...వారి వివరాలు

Pradeep Boddu -TTA Chair 
Shiva Reddy Kolla - Joint Secretary
Manohar Bodke - Joint Treasurer 
Pradeep Mettu - National Coordinator
Ganesh Veeramaneni - Ethics Committee Director
Sangeetha Reddy - Board of Director
Venkat Gaddam - Board of Director

 

Click here for Event Gallery

 

 

 

Tags :