ASBL NSL Infratech

తెలుగు మహాసభలు ఈ దశాబ్దపు అద్భుతం : తనికెళ్ల భరణి

తెలుగు మహాసభలు ఈ దశాబ్దపు అద్భుతం : తనికెళ్ల భరణి

ప్రపంచ తెలుగు మహాసభలు ఈ దశాబ్దపు అద్భుతమని ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి అన్నారు. రవీంద్రభారతిలో ప్రవాస తెలుగువారి భాష -సాంస్కృతిక విద్యా విషయాలపై జరిగిన చర్చలో తనికెళ్ల భరణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు భాషకు పునరుజ్జీవం పోసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పాదాభివందనం తెలిపారు. విదేశాల్లోనే తెలుగు సృష్టంగా ఉందని, మనదగ్గర అటుఇటుగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు ఈ తెలుగు మహాసభలు కొత్త స్ఫూర్తిని నింపాయన్నారు. భాషాభిమానులతో ప్రపంచ తెలుగు మహాసభలు కిక్కిరిసి పోతున్నయన్నారు.

 

Tags :