ASBL NSL Infratech

తానా వనభోజనాలు సక్సెస్‌...పూర్ణ మలావత్‌కు సత్కారం

తానా వనభోజనాలు సక్సెస్‌...పూర్ణ మలావత్‌కు సత్కారం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఫిలడెల్ఫియా టీమ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వనభోజనాల కార్యక్రమం విజయవంతమైంది. దాదాపు 800 మంది ఈ వనభోజనాలకు వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆటలు, విందు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆటల పోటీల్లో అందరూ పాల్గొని ఎంజాయ్‌ చేశారు. ఇలాంటి చక్కటి కార్యక్రమాన్ని పసందుగా నిర్వహించిన ఫిలడెల్ఫియా తానా టీమ్‌ను అందరూ అభినందించారు.

సెప్టెంబర్‌ 29వ తేదీన ఫిలడెల్ఫియాలోని కాలేజ్‌ విల్లే, ఎవాన్స్‌బర్గ్‌ స్టేట్‌ పార్క్‌లో ఏర్పాటు చేసిన ఈ వనభోజనాల కార్యక్రమానికి చిన్నవయస్సులోనే ఎవరెస్ట్‌ శిఖరాన్ని చిన్నవయస్సులోనే అధిరోహించి చరిత్ర సృష్టించిన మలావత్‌ పూర్ణ హాజరయ్యారు. తానా నాయకులు రవి పొట్లూరి, రవి మందలపు, లక్ష్మీదేవినేని, నాగరాజు నలజుల, సతీష్‌ చుండ్రు, రాజా కసుకుర్తి, సతీష్‌ తుమ్మల, మోహన్‌ మల్ల, సాయి జరుగుల, కృష్ణ కొనగళ్ళ, చైతన్య వడ్లపట్ల, రంజిత్‌ చాగంటి, సునీల్‌ కోగంటి, గోపీ, సాంబయ్య కోటపాటి, సరోజ పావులూరి, ఫణికంతేటి, చలం పావులూరి, బాలాజీ కరి, పృథ్వీరాజ్‌, వంశీ వాసిరెడ్డి, సురేష్‌ యలమంచిలి, కృష్ణ నందమూరి, రమ ముద్దన, రాజ్‌ కుకునూర్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫిలడెల్ఫియా తానా టీమ్‌ పూర్ణ మలావత్‌ను సత్కరించింది. పోటీల్లో పాల్గొన్నవారికి ప్రైజ్‌లను కూడా ఇచ్చింది. రవి పొట్లూరి మాట్లాడుతూ, ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించారని, వలంటీర్లు చేసిన సర్వీస్‌ గొప్పదని ప్రశంసించారు. అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.

Click here for Event Gallery

 

Tags :