ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

దుర్గి మండలంలో తానా రైతు సదస్సు

దుర్గి మండలంలో తానా రైతు సదస్సు

గుంటూరు జిల్లా దుర్గి మండలం ఓబులేశునిపల్లెలోని జడ్పీ హైస్కూల్‌లో గురువారం రాత్రి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో జరిగిన రైతు సదస్సులో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు తానా తరపున రక్షణ పరికరాలను పంపిణీ చేశారు. తానా రైతుకోసం కార్యక్రమ కో ఆర్డినేటర్‌ కోట జానయ్య ఆధ్వర్యంలో ఈ సదస్సు జరిగింది.

ఈ సందర్భంగా టీడీపీ మాచర్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కొమ్మారెడ్డి చలమారెడ్డి మాట్లాడుతూ, సుస్థిర వ్యవసాయం, ప్రకృతి వనరుల పరిరక్షణకు రైతులు అలవాటు పడాలన్నారు. పలువురు వ్యవసాయ శాస్త్రవేత్తలు మాట్లాడుతూ చిరుధాన్యాలను ఆహారంగా తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. చిరు ధాన్యాలలో పుష్కలంగా పోషకాలు ఉంటాయన్నారు. సదస్సు ప్రారంభానికి ముందు విద్యాబంధు గోరంట్ల వాసు ఆర్థికసాయంతో హైస్కూల్‌లోని ప్రయోగశాలకు కొనుగోలు చేసిన సామగ్రిని చలమారెడ్డి ప్రారంభించారు. అలాగే కోట హనుమంతురావు ఆర్థికసాయంతో ఏర్పాటు చేసిన డిజిటల్‌ క్లాస్‌రూంను కూడా ప్రారంభించారు.

సదస్సులో భారతీయ చిరుధాన్యాల సంస్థ శాస్త్రవేత్త సుబ్బారాయుడు, మరో శాస్త్రవేత్త సీహెచ్‌ సతీష్‌, జంగమహేశ్వరపురం, వ్యవసాయ కళాళాల శాస్త్రవేత్త నల్లా సాంబశివరావు, నీలగిరి ఫౌండేషన్‌ చైర్యన్‌ రఘురామిరెడ్డి, మాచర్ల మార్కెట్‌యార్డు చైర్మన్‌ శెట్టిపల్లి యలమంద, మాజీ చైర్మన్‌ యాగంటి మల్లికార్జునరావు, టీడీపీ మండల అధ్యక్షుడు యేచూరి రవి, మునుగోటి రామలక్ష్మయ్య, ఏడీఏ కబ్బిరెడ్డి, ఏవో సంధ్యారాణి పాల్గొన్నారు.

 

Tags :