ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

రైతుల శ్రేయస్సుకు 'తానా' ముందుకు రావడం హర్షణీయం

రైతుల శ్రేయస్సుకు 'తానా' ముందుకు రావడం హర్షణీయం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) దేశం కోసం, రైతుకోసం కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ పేర్కొన్నారు. తానా ఆధ్వర్యంలో రైతులకు రక్షణ పరికరాలు, ప్రభుత్వ పాఠశాలలకు ఎల్‌ఈడీ టీవీలను అందించేందుకు ముందుకు రావడం ఎంతో మందికి స్పూర్తిని కలిగిస్తుందని తెలిపారు. శుక్రవారం సాయంత్రం భద్రాచలంలో ఎడ్లబండ్ల ప్రదర్శన చేపట్టారు. ఐటీడీఏలో ఏర్పాటు చేసిన సమావేశంలో వీటిని పంపిణీ చేశారు. దేవతలను పూజించేందుకు ఉపయోగించే పరమాన్నం సైతం రైతు పండిస్తాడని అలాంటి రైతులను దేవుళ్లుగా పూజించే రోజులు రావాలన్నారు. సబ్బండ కులాలు అల్లుకున్న కుటుంబ సముదాయమే రైతు అని వెల్లడించారు.

సమావేశంలో తానా అధ్యక్షుడు సతీశ్‌ వేమన మాట్లాడుతూ మాత దేశానికి సేవ చేయాలన్న ఆకాంక్షతో కార్యక్రమాలను చేపట్టామని, ముఖ్యంగా రైతు శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఈ కిట్లు అందిస్తున్నామని తెలిపారు. ఆదర్శ రైతులను అమెరికాకు తీసుకెళ్లి అక్కడ సాగు విధానాల గురించి ఆకళింపు చేసుకునేలా కషి చేస్తామని వెల్లడించారు. ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌, చైతన్యస్రవంతి కార్యక్రమాల కో ఆర్డినేటర్‌ జే తాళ్లూరి మాట్లాడుతూ వ్యవసాయ కుటుంబంలో పుట్టి ఆ రంగంలో ఉన్న కష్టనష్టాలు తెలియడం వల్ల సేద్యానికి ఏదో విధంగా సాయపడాలని ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఎన్నో పరిశోధనల అనంతరం రైతు రక్షణ కిట్లు అందించేందుకు చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. పంచాక్షరయ్య మాట్లాడుతూ రైతే రాజుగా గుర్తింపు తెచ్చుకునేందుకు అందిస్తున్న ఈ సహకారం భవిష్యత్తులోను కొనసాగించాలని సూచించారు.

కార్యక్రమానికి వచ్చిన సినీనటులు

తానా నిర్వహించిన కార్యక్రమంలో పలువురు సినీనటులు పాల్గొన్నారు. బిగ్‌బాస్‌ సీజన్‌-1 విజేత శివబాలాజీ, సమీర్‌, జ్యోతి, దీక్షాపంత్‌ ఈ సదస్సుకు హాజరై అలరించారు. సినీ తారలుగా ఎంతటి పేరు సంపాదించుకున్నామో బిగ్‌బాస్‌ ద్వారా అదేస్థాయిలో అందరి ఆదరణ పొందామని వీరు పేర్కొన్నారు. రైతులకు సంబంధించి తానా చేపట్టిన ఈ సదస్సులో పాల్గొనడం ఆనందాన్ని కలిగిస్తుందని తెలిపారు. విద్యాలయాలకు మౌలిక సదుపాయాలను సమకూర్చడం అభినందనీయమని తెలిపారు. ఈ గట్టునుంటావా పాటను ఆలపించి శివనాగులు ఉత్సాహం నింపారు. జానపద కళాకారులు ఆడిపాడారు. నత్యాలు అలరించాయి. ఐటీడీఏ పీవో పమెలా సత్పథి, తానా ప్రతినిధులు తాళ్లూరి రాజా, లావు అంజయ్య చౌదరి, రవి పొట్లూరి, జానయ్య, ప్రకాశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Click here for Event Gallery

 

Tags :