ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

తానా - అంతర్జాతీయ పితృదినోత్సవ కవితా పోటీల విజేతలు

తానా - అంతర్జాతీయ పితృదినోత్సవ కవితా పోటీల విజేతలు

"తానా ప్రపంచ సాహిత్య వేదిక" ఆధ్వర్యంలో "నాన్నా - నీకు నమస్కారం" అంటూ జూన్ 21, 2020న అంతర్జాతీయ పితృదినోత్సవ వేడుకలను దృశ్య సమావేశంలో జరుపుతున్నామని, ఈ వేడుకలకు విశిష్ట అతిథులుగా పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి, శ్రీ తనికెళ్ళ భరణి గారు హాజరవుతారని తానా అధ్యక్షుడు జయశేఖర్ తాళ్లూరి, తానా ప్రపంచ సాహిత్య వేదిక సారధి డాక్టర్. ప్రసాద్  తోటకూర ప్రకటించారు. 

"ఘనుడు నాన్న - త్యాగధనుడు నాన్న" అనే అంశం పై కవితా పోటీలను నిర్వహించగా ప్రపంచ వ్యాప్తంగా 750 కి పైగా కవితలు అందాయని, జూన్ 21న విజేతలకు బహుమతి ప్రదానం, కవుల కవితాగానం ఉంటుందని సమన్వయకర్త చిగురుమళ్ల శ్రీనివాస్  తెలియజేశారు.   

విజేతలు:  

ప్రథమ బహుమతి: మౌనశ్రీ మల్లిక్ (హైదరాబాద్)
ద్వితీయ బహుమతి: జయశ్రీ మువ్వా (ఖమ్మం) 
తృతీయ బహుమతి: ప్రొఫెసర్. రామ చంద్రమౌళి (వరంగల్)

ప్రత్యేక ప్రోత్సాహకాలు: 

1.రాపోలు సీతారామరాజు (సౌత్ ఆఫ్రికా) 2. అల్లాల రత్నాకర్ (బెహ్రయిన్ ) 3. డి. దివ్య ప్రశాంత్ (ఆస్ట్రేలియా) 4. పంతుల కృష్ణమూర్తి (ఒమెన్) 5. డా. నక్త వెంకట మనోహర రాజు (యూ ఎస్ ఏ) 6. డా.  వడ్డేపల్లి కృష్ణ (హైదరాబాద్) 7. సి. యమున (హైదరాబాద్) 8. సిరాశ్రీ (హైదరాబాద్) 9. మధురాంతకం మంజుల (తమిళనాడు) 10. పుష్పలత (బెంగుళూరు) 11. జె.కె. భారవి (హైదరాబాద్)  12. సిద్ధాంతపు ప్రభాకరాచార్యులు (అశ్వారావుపేట) 13. డా. అడిగొప్పుల శేషు (భద్రాది జిల్లా) 14. చలపాక ప్రకాష్ (విజయవాడ) 15. రమాదేవి కులకర్ణి (హైదరాబాద్) 16. డా. మనోహరరావు ఉమా గాంధీ (విశాఖపట్నం) 17. చంద్రకళ యలమర్తి (యూ ఎస్ ఏ) 18. పుప్పాల కృష్ణచంద్ర మౌళి (ఒరిస్సా) 19. డా. ఎం. సి. దాస్ (విజయవాడ) 20. బండారి రాజ్ కుమార్ (వరంగల్) 21. గూటం స్వామి (రాజామహేంద్రవరం) 22. గట్టు రాధామోహన్ (హనుమకొండ) 23. బోడ కూర్మారావు (విశాఖపట్నం)

ఈ పితృదినోత్సవ వేడుకలు  అంతర్జాతీయ దృశ్య  సమావేశం ఆదివారం, జూన్ 21, 2020 న (అమెరికా CDT 11:00 am, ఇండియా 9:30 pm) జరుగనుంది.  ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సాహితీ ప్రియులందరూ ఈ దృశ్య సమావేశం లో ఈ క్రింది ఏ మాధ్యమాల ద్వారా నైనా  పాల్గొనవచ్చని ఆహ్వానం పలికారు.    

  1. Facebook:https://www.facebook.com/tana.org 
  1. YouTube Channel :https://www.youtube.com/channel/UCwLhSy1ptf0i1CioyeZmzrw 
  1. Watch Live on mana TV & TV5 International

ఈ కార్యక్రమానికి వెన్నం ఫౌండేషన్ పోషకదాత గాను, బైట్ గ్రాఫ్స్ సాంకేతిక సహకారాన్ని అందిస్తున్నారు. 

మిగిలిన వివరాలకు www.tana.org      

Tags :