ASBL NSL Infratech

తానా ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

తానా ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా) ఎగ్జిక్యూటివ్‌ కమిటీ కార్యవర్గానికి, బోర్డ్‌ డైరెక్టర్‌, ఫౌండేషన్‌ ట్రస్టీ, రీజినల్‌ రిప్రజెంటేటివ్‌ పదవులకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిటీ ప్రకటించింది. ఎన్నికల కమిటీ చైర్మన్‌ కనకంబాబు ఐనంపూడి ఈ మేరకు ప్రకటనను వెలువరించారు. నామినేషన్ల దాఖలుకు తుది గడువు నవంబర్‌ 16, 2023, నామినేషన్‌ విత్‌ డ్రా చేసుకునే గడువు నవంబర్‌ 30, ఫైనల్‌ నామినేషన్‌ ప్రకటన డిసెంబర్‌ 3న, బ్యాలెట్‌ కౌంటింగ్‌ జనవరి 13, ఫలితాల ప్రకటన జనవరి 14న ఉంటుందని ఎన్నికల కమిటీ ఈ ప్రకటనలో తెలియజేసింది. 
ఇతర వివరాలకు తానా వెబ్‌ సైట్‌ https://tana.org/elections చూడండి.

 

 

 

Tags :