ASBL NSL Infratech

కోవిడ్ వేళ...ఇమ్మిగ్రేషన్ సందేహాలపై తానా కాన్ఫరెన్స్ కాల్ సమావేశం

కోవిడ్ వేళ...ఇమ్మిగ్రేషన్ సందేహాలపై తానా కాన్ఫరెన్స్ కాల్ సమావేశం

అమెరికాలో కోవిడ్‍ 19 వైరస్‍ విస్తరిస్తుండటంతో ఇమ్మిగ్రేషన్‍ విషయాలపై వస్తున్న పలు సందేహాలను నివృత్తి చేసేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం అటార్నీతో ఓ కాన్ఫరెన్స్ కాల్‍ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కోవిడ్‍ 19 ఎంప్లాయ్‍మెంట్‍ ఆథరైజేషన్స్, 1-9 వెరిఫికేషన్స్, రిమోట్‍ వర్క్ ఆఫ్షన్స్, యూనివర్సిటీస్‍, ట్రావెల్‍ ఆంక్షలు, ఇతర విషయాలపై ఈ కాన్ఫరెన్స్ కాల్‍ మీటింగ్‍ను తానా ఏర్పాటు చేసింది. బిబిఐ లా గ్రూపుకు చెందిన ఇమ్మిగ్రేషన్‍ అటార్నీ భాను బాబు ఇలింద్రా తో ఈ కాన్ఫరెన్స్ కాల్‍ను ఏర్పాటు చేశారు. మార్చి 29వ తేదీ సిఎస్‍టీ టైమ్‍ మధ్యాహ్నం 2 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుంది. అందరూ ఈ కాన్ఫరెన్స్ కాల్‍లో పాల్గొని తమ సందేహాలను తీర్చుకోవాలని తానా అధ్యక్షుడు జయ్‍ తాళ్ళూరి, తానా ప్రెసిడెంట్‍ ఎలక్ట్ అంజయ్య చౌదరి  తానా కమ్యూనిటీ సర్వీసెస్‍ కో ఆర్డినేటర్‍ మల్లి వేమన, సౌత్‍ వెస్ట్ రీజినల్‍ వైస్‍ ప్రెసిడెంట్‍ మురళీ తాళ్ళూరి కోరారు.

To join call please dial 605-313-4100 and enter PIN: 695578# to join conference call.

 

Tags :