ASBL NSL Infratech

వైభవంగా టిఎజిసి దీపావళి వేడుకలు

వైభవంగా టిఎజిసి దీపావళి వేడుకలు

చికాగో మహా నగర తెలుగు సంస్థ (టిఏజిసి) సభ్యులు మరియు అతిథులతో కలిసి ఇక్కడి స్థానిక..ఎల్లోబాక్స్‌ ఆడిటోరియంలో ఈ సంవత్సరం చివరి కార్యక్రమైన దసరా మరియు దీపావళి వేడుకలను చాలా ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ప్రఖ్యాత సంగీత దర్శకులు అనూప్‌ రూబెన్స్‌ వారి బృందం ధనుంజయ్‌, పృథ్విచంద్ర, రోల్‌ రిదా, భార్గవి పిళ్ళై, ఉమా నేహా మరియు రినైనా రెడ్డి రావడం, వారు నిర్వహించిన ప్రత్యక్ష గాన కచేరి ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పలువురు స్థానిక ప్రముఖులతో పాటు, 2000 కి పైగా అతిథులు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని మరవలేని మరో టీఎజీసీ కార్యక్రమంగా విజయవంతం చేశారని సంస్థ కోశాధికారి వెంకట్‌ గునుగంటి తెలిపారు. సప్త సముద్రాలూ దాటి విదేశాల్లో ఉన్న తెలుగు వారిని తమ సంస్కృతి సంప్రదాయాలకు టిఏజిసి ఈ సంబరాల ద్వారా మరింత దగ్గర చేసింది అనుటలో ఎలాంటి సందేహము లేదు. ముఖద్వారం వద్ద పండుగ వాతావరణాన్ని తలపించేలా టీఏజీసీ బ్యానర,  చక్కని తోరణలతో స్వాగత ద్వారాము స్టేజీ వద్ద టీఏజీసీ లోగో తో చాలా చక్కగా అలంకరణ కార్యదర్శి దీప్తి ముత్యంపేట మరియు ప్రదీప్‌ గింగు టీమ్‌ చక్కగా అలంకరించారు.

టీఏజీసీ సంస్థ అధ్యక్షుడు శ్రీ రామచందర్‌ రెడ్డి ఏడే, సాంస్కృతిక సభ్యుల సంస్థ కార్యవర్గ సభ్యులతో కలిసి దీపావళి ఉత్సవ కార్యక్రమాలను గణపతి ఆరంభించారు. అధ్యక్షుల ఉపన్యాసంలో సంస్థ సభ్యులకు అతిధులకు దసరా, దీపావళి శుభాకాంక్షలు తెలియజేసారు. తెలుగు జాతి సంస్కృతి, సంప్రదాయాలు మరియు దీపావళి పండుగా ఔన్నత్యాన్ని కొనియాడారు. సాంస్కృతిక కమిటి సభ్యులు కార్యదర్శి సుజాత కట్ట, ప్రవీణ్‌ వేములపల్లి ఈ దీపావళి వేడుకలను పురస్కరించుకొని పలు సాంస్కృతిక కార్యక్రమాలను 330 మంది స్థానిక కళాకారులతో చాలా చక్కగా రూపొందించారు. దీపావళి పండుగ విశిష్టతలను తెలిపే చీకటిని పారదోలుతూ వెలుగు తెచ్చే విధముగా చేసిన నృత్యం, చీకటిని పారదోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, 25 మంది సంస్థ ఆడపడుచులు లక్ష్మి దేవిని స్తుతించే కీర్తన, నిన్న మొన్నటి నేటి తరాల హిందీ నటుల పాటలతో నృత్యాలు మరియు దీపావళి విజయానికి ప్రతీకగా నిరూపించే నృత్యం, ప్రత్యేక ఆకర్షణగా ఈ వేడుకల్లో నిలిచాయి.

కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులకు, కళాకారులకు, అధ్యక్షులుగా రామచంద్ర రెడ్డి ఏడే, దాతలు సర్టిఫికెట్‌లను అందజేశారు. అలాగే ఈ సంవత్సరము ఎలాంటి లాభార్జన  లేకుండా సంస్థ కార్యక్రమాలలో సహాయ సహకారాలు అందించిన వలంటీర్‌లకు అధ్యక్షులు రామ్‌చంద్రా రెడ్డి గారు సంస్థ మెమోంటోలను బహూకరించారు.

విందు అనంతరం ఏర్పాటు చేసిన ప్రత్యేక్ష పాటల కచేరి (మ్యూజికల్‌ నైట్‌) ప్రేక్షకులను ఎంతో అలరించింది.  ప్రముఖ టాలీవుడ్‌ సంగీత దర్శకులు అనూప్‌ రూబెన్స్‌ మరియు వారి బృందం ప్లేబాక్‌ సింగర్స్‌ ధనుంజయ్‌, పృధ్వీచంద్ర, రోల్‌ రిదా, రినైనా రెడ్డి, భార్గవి పిళ్ళై వారి మధుర గాత్రముతో విచ్చేసిన అతిథులను తమ పాటలతో మరో ప్రపంచానికి తీసుకెళ్లారు.అనూప్‌ చిన్నారులతో పాడించిన పాట, చికాగో దీపావళి వేడుకలు కళా ప్రాంగణములోనే ఉందా అన్నట్లుగా సాగింది.

పాటల కచేరి విరామ సమయములో సంస్థ గత సంవత్సర అధ్యక్షులు శ్రీ ప్రదీప్‌ కందిమళ్లను శాలువా కప్పి, మెమోంటోతో సత్కరించారు. అలాగే ఈ సంవత్సర కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ, ధన సహాయ సహకారాలు అందించిన దాతలందరికి ఈ సంవత అధ్యక్షులు రామచంద్ర రెడ్డ పూల గూష్ఫముతో ఆహ్వానించి, శాలువా కప్పి, మెమోంటోతో సత్కరించారు.


Click here for Event Gallery

 

Tags :