ASBL NSL Infratech

యాగశాల...రామానుజ ప్రాంతాలు

యాగశాల...రామానుజ ప్రాంతాలు

హైదరాబాద్‌లోని ముచ్చింతల్‌లో రామానుజాచార్యుల సహస్రాబ్ది వేడుకల్లో భాగంగా యాగశాల విశిష్టతను త్రిదండి చినజీయర్‌ స్వామి వేదపండితులు, రామానుజ భక్తులకు వివరించారు. యాగశాలను మొత్తంగా నాలుగు భాగాలుగా విభజించినట్లు వివరించారు. యాగశాలలో ఏర్పాటు చేసిన బోగమండపం శ్రీరంగానికి ప్రతీక అని, పుష్పమండపం తిరుమల క్షేత్రానికి, త్యాగమండపం కాంచీపురం క్షేత్రానికి, జ్ఞాన మండపం మేలుకోట క్షేత్రానికి ప్రతీకలని అభివర్ణించారు. ఆయా పుణ్యక్షేత్రాలతో రామానుజాచార్యుల జీవితానికి అద్భుతమైన అనుబంధముందని తెలిపారు. 

 

Tags :