ASBL NSL Infratech

తెలుగు ప్రపంచ భాష : రాష్ట్రపతి

తెలుగు ప్రపంచ భాష : రాష్ట్రపతి

తెలుగు భాషకు ఎంతో విశిష్ట చరిత్ర ఉందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కొనియాడారు. తెలుగు ప్రపంచ భాష అని పేర్కొన్నారు. దేశంలో హిందీతర్వాత అత్యధికంగా మాట్లాడే భాష తెలుగు అని ఆయన తెలిపారు. ఎల్‌బి స్టేడియంలో నిర్వహించిన  ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. సోదర సోదరిమణులారా నమస్కారం. దేశ భాషలందు తెలుగు లెస్స అని రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రసంగం ప్రారంభంలో తెలుగులో మాట్లాడారు. రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా తెలంగాణకు వచ్చానని రామ్‌నాథ్‌ కోవింద్‌ చెప్పారు. ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకలకు హాజరైనందుకు సంతోషంగా ఉందన్నారు.

తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల నుంచి, 42 దేశాలు, 17 రాష్ట్రాల నుంచి ఈ సభలకు హాజరైన వారందరికీ అభినందనలు తెలిపారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. దేశంలో హిందీ తర్వాత అత్యధికంగా తెలుగు భాష మాట్లాడుతారని తెలిపారు. దక్షిణాప్రికా నుంచి దక్షిణాసియా వరకు తెలుగువాళ్లు ఉన్నారని పేర్కొన్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో తెలంగాణ నవంబర్‌ వన్‌ స్థానంలో ఉందన్నారు. తెలుగు భాషాభివృద్ధికి గురజాడ అప్పారావు విశేష కృషి చేశారని గుర్తు చేశారు. ఐదు రోజులుగా తెలుగు భాష గొప్పదనం గురించి మాట్లాడుకోవడం అభినందనీయమని తెలిపారు. దేశంలో తెలుగు రెండో అతి పెద్ద భాష అని, ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మాతృభాష అని పేర్కొన్నారు.

స్వాతంత్య్ర ఉద్యమంలో తెలుగువారి త్యాగాలు మరువలేనివని కొనియాడారు. కొమురంభీం, చిట్యాల ఐలమ్మ, అల్లూరి సీతారామరాజు వీరోచిత పోరాటం చేశారని తెలిపారు. హైదరాబాద్‌ అంటే బిర్యానీ బ్యాడ్మింటన్‌, బాహుబలి అని పేర్కొన్నారు. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అని  తెలుగులో వ్యాఖ్యానించారు.

Click here for Photogallery

 

Tags :