ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

పెట్టుబడులు పెట్టాలంటే భారత్‌కు రండి...

పెట్టుబడులు పెట్టాలంటే భారత్‌కు రండి...

పెట్టుబడులు పెట్టాలనుకుంటే భారత్‌కు రావాలని పారిశ్రామిక వేత్తలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దేశంలో అందుకు అనుగుణమైన వాతావరణం ఉందని చెప్పారు. ఇటీవల కార్పోరేట్‌ ట్యాక్స్‌ను తగ్గించి ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని, వ్యాపారానికి అనుకూలమైన వాతావరణం కల్పించిందన్నారు. న్యూయార్క్‌లోని బ్లూమ్‌బర్గ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్లోబల్‌ బిజినెస్‌ ఫోరంలో మోదీ పెట్టుబడిదారుల నుద్దేశించి ప్రసంగించారు. పెట్టుబడులకు అనుకూలమైన మార్కెట్‌ కోసం ఎదురు చూస్తున్నారా? భారత్‌ రండి.. అతిపెద్ద మార్కెట్‌ కలిగిన స్టార్టప్‌ల్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారా? అయితే, భారత్‌కు రండి.. ప్రపంచంలోనే అతి ఎక్కువ మౌలిక వసతులు కలిగిన దేశంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటే భారత్‌ రండి అంటూ పెట్టబడి దారులు మోదీ ఆహ్వానించారు.

భారత్‌లోని నగరాలను ఆధునీకరిస్తున్నామని చెప్పారు. ఇంతకుముందెన్నడూ లేని విధంగా రక్షణ రంగంలోనూ పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం కల్పించామని చెప్పారు. సులభతర వాణిజ్యం కోసం 50 చట్టాలను రద్దు చేశామని అన్నారు. ప్రస్తుతం దేశంలో వ్యాపారాన్ని గౌరవించే, సంపద సృష్టిని ప్రోత్సహించే ప్రభుత్వం ఉందని తెలిపారు. భారత్‌ 2024-25 నాటికి 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా పెట్టుకుందని మోదీ వివరించారు. ప్రస్తుతం ఒక ట్రిలియన్‌ డాలర్లను ఆర్థిక వ్వవస్థను జోడించామన్నారు.

 

 

Tags :