ASBL NSL Infratech

శాన్‌ ఫ్రాన్సిస్కోలో లోకేష్‌ సమావేశం జయప్రదం

శాన్‌ ఫ్రాన్సిస్కోలో లోకేష్‌ సమావేశం జయప్రదం

స్మార్ట్‌విలేజ్‌ - స్మార్ట్‌వార్డు కార్యక్రమంపై ఎన్నారైలను చైతన్యపరిచేందుకు అమెరికాలో మే 3వ తేదీ నుంచి పర్యటిస్తున్న తెలుగుదేశం పార్టీ యువనేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్‌ ఈరోజు (మే 8) బే ఏరియా ఎన్నారై టీడిపి ఏర్పాటు చేసిన మీట్‌ అండ్‌ గ్రీట్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. మిల్‌పిటాస్‌లోని ఐసీసిలో జరిగిన ఈ కార్యక్రమానికి టీడిపి అభిమానులతోపాటు ఇతర ప్రముఖులు కూడా హాజరయ్యారు. దాదాపు 800 మంది ఈ కార్యక్రమానికి వచ్చారు. ఎన్నారై టీడిపి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. తొలుత నారా లోకేష్‌ సమావేశమందిరానికి వచ్చినప్పుడు ఆయనకు వేదమంత్రాల నడుమ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. హెలికాఫ్టర్‌ నుంచి ప్రత్యేకంగా పూలవర్షం కురిపించారు. టీడిపి అబిమానుల నినాదాల మధ్య ఆయనను లోపలికి తీసుకువచ్చారు. జయరాం కోమటి, ఎన్నారై టీడిపి అభిమానులు లోకేష్‌ను పూలమాలలతో ఘనంగా సత్కరించారు. జ్యోతిప్రజ్వలన చేసిన తరువాత లోకేష్‌ ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎన్నారై టీడిపి బే ఏరియా నిర్వహించిన కార్యక్రమాలపై ఆడియో వీడియో ప్రజంటేషన్‌ చేశారు. మిల్‌పిటాస్‌ మేయర్‌ జోస్‌ ఎస్టీవ్స్‌ లోకేష్‌కు మెమోంటోనూ, ప్రశంసాపత్రాన్ని అందజేశారు. లోకేష్‌పై ఆడియో వీడియో ప్రజంటేషన్‌ జరిగిన తరువాత పలువురు వక్తలు మాట్లాడారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో తనకు 12 ఏళ్ళుగా అనుబంధం ఉందని జయరాం కోమటి గుర్తు చేస్తూ ఆయన చేస్తున్న ఎన్నో కార్యక్రమాలకు ఎన్నారై టీడిపి తరపున సహకారాన్ని అందిస్తూ వస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. గతంలో జన్మభూమి కార్యక్రమాల్లో ఎన్నారైలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని అదే విధంగా ఇప్పుడు స్మార్ట్‌విలేజ్‌ కార్యక్రమంలో కూడా ఎన్నారైలు పెద్ద సంఖ్యలో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. బే ఏరియా ప్రముఖుడు లకిరెడ్డి హనిమిరెడ్డి మాట్లాడుతూ, తాను 1999 నుంచి తన సంపాదనను అంతా దానధర్మాలకే వినియోగిస్తున్న విషయాన్ని తెలిపారు. ఇప్పటివరకు ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే అభివృద్ధిపనుల కోసం తాను దాదాపు 45 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు చెప్పారు. జన్మభూమి అభివృద్ధికి అందరూ ముందుకు రావాలని ఆయన కోరారు.

ఎన్నారై టీడిపి నాయకులు వెంకట్‌ కోగంటి, కళ్యాణ్‌ వీరపనేని, సతీష్‌ అంబాటీ మాట్లాడుతూ, చంద్రబాబు చేస్తున్న కార్యక్రమాలకు తమవంతు సహాయం అందిస్తామని చెప్పారు. 

తరువాత లోకేష్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేయడానికి చేస్తున్న కృషిని, ప్రణాళికలను వివరించారు. నిజాం రాజులు హైదరాబాద్‌ను అభివృద్ధి చేసేందుకు 300 సంవత్సరాలు తీసుకున్నారని, బ్రిటీష్‌వాళ్ళు సికిందరాబాద్‌ను అభివృద్ధి చేసేందుకు 150 ఏళ్ళు తీసుకోగా, కేవలం 9 ఏళ్ళలోనే హైదరాబాద్‌ను ప్రపంచ దేశాలు గుర్తించేలా ఐటీరంగంలో మేటీగా చంద్రబాబు అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. ఆయన దూరదృష్టి వల్లనే నేడు అమెరికాలో తెలుగువాళ్ళు ఐటీరంగాన్ని శాసించగలుగుతున్నారని తెలిపారు. ఇంజనీరింగ్‌ కాలేజీలు ఎక్కువగా పెట్టి అందరికీ సాంకేతిక విద్యను అందించి వారిని మేటీ ఐటీ నిపుణులుగా తయారు చేయడంలో చంద్రబాబు కృషి చేశారని చెప్పారు. ఇప్పుడు రాష్ట్రం రెండుగా విడిపోయాక ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధిపర్చేందుకు ముఖ్యమంత్రి అనేక పథకాలను ప్రవేశపెట్టారని చెప్పారు.

2022 నాటికి దేశంలోని 3 ఉత్తమ రాష్ట్రాలలో ఒకటిగా, 2029నాటికి దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా, 2050 నాటికి ఆగ్నేయాసియా దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ ఉండాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. లాంగ్‌ విజన్‌తో ముందుకెళుతున్న చంద్రబాబు నాయుడు తన విజన్‌ సక్సెస్‌ కావాలంటే పల్లెల నుంచే అభివృద్ధి కావాలని తలచారు. అందులో భాగంగానే స్మార్ట్‌విలేజ్‌, స్మార్ట్‌వార్డ్‌ కార్యక్రమాన్ని ఆయన తీసుకువచ్చారు. ఇందులో ఎన్నారైలు పెద్దసంఖ్యలో ముందుకు వస్తే గ్రామాలు ప్రగతి సాధించడం ఖాయమని ఆయన భావిస్తున్నారు. ఎన్నారైలు ఇందుకోసం కొంత సమయాన్ని కేటాయించాల్సిందిగా నేను ప్రత్యేకంగా కోరుతున్నానని చెబుతూ గ్రామాల దత్తత తీసుకునేవారికి ప్రభుత్వంవైపు నుంచి కూడా మంచి సహకారం ఉంటుందని చెప్పారు. తరువాత వచ్చినవారు అడిగిన ప్రశ్నలకు లోకేష్‌ ఓపిగ్గా సమాధానం చెప్పారు. ఈ వేదికపై ‘తెలుగు టైమ్స్‌’ ప్రచురించిన స్మార్ట్‌విలేజ్‌ - స్మార్ట్‌ వార్డ్‌ ప్రత్యేక సంచికను లోకేష్‌ ఆవిష్కరించారు.

లోకేష్‌ ప్రసంగంతో ఉత్తేజితులైన పలువురు ఎన్నారైలు అప్పటికప్పుడే గ్రామాల దత్తతకు ముందుకు వచ్చారు. దాదాపు 250 మంది 250 గ్రామాలను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. తెలుగు టైమ్స్‌ ఎడిటర్‌ చెన్నూరి సుబ్బారావు కూడా కృష్ణాజిల్లాలోని తన స్వగ్రామం చెన్నూరును దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

అంతకుముందు బే ఏరియా ఎన్నారై టీడిపి విభాగం పాల్‌ఆల్టోలోని ఫోర్‌సీజన్స్‌ హోటల్‌లో లోకేష్‌తో సమావేశమైంది. ఎన్నారైటీడిపికి తగిన గుర్తింపును ఇవ్వాలని, ప్రభుత్వ పథకాల్లో ఎన్నారైలకు తగిన ప్రాధాన్యం ఉండేలా చూడాలని కోరింది. ఆంధ్రప్రదేశ్‌ ఎంట్రప్రెన్యూరర్స్‌ ఫౌండేషన్‌ కూడా లోకేష్‌తో సమావేశమై ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి తమవంతుగా సహకారాన్ని అందిస్తామని హామి ఇచ్చింది. ఇందులో కంపెనీ సిఇఓలు సభ్యులుగా ఉన్నారు. 

Click here for PhotoGallery
 

\r\n', 'Nara Lokesh, TDP, USA, Tour, speech, San Francisco, NRIs, Smart Village', 'Nara Lokesh, TDP, USA, Tour, speech, San Francisco, NRIs, Smart Village', 'స్మార్ట్‌విలేజ్‌ - స్మార్ట్‌వార్డు కార్యక్రమంపై ఎన్నారైలను చైతన్యపరిచేందుకు అమెరికాలో మే 3వ తేదీ నుంచి పర్యటిస్తున్న తెలుగుదేశం పార్టీ యువనేత', '1431183798okesh15.jpg', '1', 423, 'Nara-Lokesh-speech-in-San-Francisco-NRI''s-on-Smart-Village', '09-05-2015', '2015-05-11 02:19:15'),

Tags :