ASBL NSL Infratech

దిగ్విజయంగా పూర్తయిన నారా లోకేష్ అమెరికా పర్యటన

దిగ్విజయంగా పూర్తయిన నారా లోకేష్ అమెరికా పర్యటన

ఆంధ్రప్రదేశ్‌లోకి పెట్టుబడులను ఆకర్షించేందుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమనిధి సమన్వయకర్త నారా లోకేష్‌ అమెరికాలో 10రోజులపాటు జరిపిన పర్యటన దిగ్విజయంగా ముగించుకొని స్వదేశానికి తిరిగి వచ్చారు.  మే 3న హైదరాబాద్‌ నుంచి ఆయన అమెరికా పర్యటనకు వెళ్లారు. అమెరికాలో శాన్‌ఫ్రాన్సికో, పోర్ట్‌ల్యాండ్‌, మిల్క్‌టాస్‌, న్యూజెర్సి,  డల్లాస్‌, వాషింగ్టన్‌ డీసీ, టెక్సాస్‌ వంటి ప్రముఖ నగరాల్లో పర్యటించి అమెరికా ప్రభుత్వ నేతలు, ఉన్నతాధికారులు, యూనివర్సిటీల ఛాన్సలర్లు, ఎంఎన్‌సీ సీఈవోలు, తెలుగు ఎన్‌ఆర్‌ఐలతో జరిగిన సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అభివృద్ధిపై సవివరంగా తెలియజేశారు. 

నారా లోకేష్‌ అమెరికా పర్యటించిన అన్ని ప్రాంతాల్లో ఎన్‌ఆర్‌ఐలు పెద్ద పెత్తున స్వాగత సత్కారాలు నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో వందల సంఖ్యలో కార్లతో ర్యాలీలను నిర్వహించి లోకేష్‌పై తమకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.  లాస్‌ ఎంజెలెస్‌ ఎన్‌ఆర్‌ఐ తెలుగుదేశం  ఆధ్వర్యంలో కార్యకర్తలు, నాయకులు సుమారు 100 కార్లతో ర్యాలీగా బయలుదేరి ఆయనకు స్వాగతం పలకడం అమెరికన్లను ఆశ్చర్యం కల్గించింది. ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న స్మార్ట్‌సిటీ, స్మార్ట్‌ విలేజ్‌ కార్యక్రమం, రాష్ట్రంలోని వనరులు, పెట్టబడుల అవకాశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబుగారి విజన్‌పై వపర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు.

అమెరికా అధ్యక్షులు ఒరాక్‌ ఒబామాను, యుఎస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కామర్స్‌ సహాయ కార్యదర్శి అరుణ్‌కుమార్‌, టెక్సాస్‌ యూనివర్సిటీ ఛాన్సలర్‌ విలియం హెచ్‌ మెక్రావాన్‌, టెక్సాస్‌ సెక్రటరీ కారోలోస్‌ కాస్‌కోస్‌, టెక్సాస్‌ గవర్నర్‌ గ్రెగ్‌ అబ్బాట్‌, లూసీయానా గవర్నర్‌ బాబి జిందాల్‌, సన్‌ మెక్రో సిస్టమ్స్‌ వ్యవస్థాపకులు వినోద్‌ ఖోస్లా, అడోబ్‌ సీఈఓ శాంతను నారాయణ్‌, ట్విట్టర్‌ జనరల్‌ కౌన్సెల్‌ విజయగద్దె, ఇన్పోసిస్‌ సిఈఓ విశాల్‌ సిక్కా, టెస్లా సీఎఫ్‌వో దీపక్‌, సీఐవో జై విజయన్‌ వంటి అమెరికా ప్రభుత్వ, ప్రభుత్వేతర ఎంఎన్‌సీ కంపెనీల దిగ్గజాలను నారా లోకేష్‌ కలిసి విస్తృతంగా చర్చలు జరిపారు. ఆయా ప్రముఖులు సానుకూలంగా స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల అవకాశాలపై అ ధ్యయనం చేసి తదుపరి కార్యచరణను అము పరుస్తామని లోకేష్‌కు హామీ ఇచ్చారు. అమెరికాలోని పోర్ట్‌ల్యాండ్‌లో అధ్యక్షుడు ఒరాక్‌ ఒబామాతో భేటీ అయిన లోకేస్‌ ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న స్మార్ట్‌సిటీ, స్మార్ట్‌వార్డు గురించి వివరించారు.  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనితీరు గురించి తాను విన్నానని, తన శుభాకాంక్షలు చంద్రబాబుకు అందించాలని ఈ సందర్భంగా ఒబామా పేర్కొన్నారు. విశాఖట్నాన్ని స్మార్ట్‌ సిటీగా రూపొందించేందుకు అమెరికా ప్రభుత్వం ముందుకు రావడం పట్ల ఒబామాకు లోకేష్‌ కృతజ్ఞతలు తెలిపారు.  ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిలో అమెరికా తోడ్పాటును కోరారు. రాష్ట్రంలో 13 స్మార్ట్‌ సిటీల అభివృద్ధికి చేస్తున్న కృషిని వివరించారు.

అమెరికా వాణిజ్య విభాగం సహాయ కార్యదర్శి అరుణ్‌కుమార్‌తో సుహృద్భావ వాతావరణంలో జరిపిన చర్చలో స్మార్ట్‌ ఆంధ్రప్రదేశ్‌ను విజయవంతంగా తీర్చిదిద్దడంపై నారా లోకేష్‌ సుదీర్ఘంగా చర్చించారు. విశాఖను స్మార్ట్‌ సిటీగా తీర్చిదిద్దడంలో అమెరికా  ముఖ్యబాగస్వామిగా పాలుపంచుకోనున్న దృష్ట్యా ఈ చర్చలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. టెక్సాస్‌ యూనివర్సిటీ ఛాన్సలర్‌ విలియం హెచ్‌ మెక్‌రావెన్‌తో భేటీ అయ్యారు.  4 మేజర్‌ పోర్టులు, 4 యాక్టివ్‌ ఎయిర్‌పోర్టులు, ప్రతి జిల్లాకు ఒక విమానాశ్రయం, రోడ్డు, రైల్‌, వాటర్‌, కనెక్టవిటీపై వివరించారు.  విశాఖపట్నంలో డెవలప్‌మెంట్‌ సెంటర్‌ నెలకొల్పేందుకు యార్లగడ కృష్ణ (ఇమాజినేషన్‌ ప్రెసిడెంట్‌) ముందుకు వచ్చారు.

విశాఖపట్నంలో అడోబ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌  సెంటర్‌ స్థాపించేందుకు అడోబ్‌ సీఈవో సెంతన్‌ నారయణ్‌ ఆసిక్తి చూపారు. ఆంధ్రప్రదేశ్‌లో స్మార్ట్‌ సిటీల అభివృద్ధికి, వైఫై జోన్ల ఏర్పాటుకు సహకరిస్తామని అరుబానెట్‌ వర్క్స అధినేత కీర్తి మెల్కోటే హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 12 మిలియన్ల గృహాలకు ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించేందుకు చేపట్టిన ఆపికల్‌ పైబర్‌ నెట్‌వర్క్‌క సహకరిస్తామని కాలియం నెట్‌వర్క్‌ సీఈవో సయ్యద్‌ అలీ హామీ ఇచ్చారు. త్వరలోనే రాష్ట్రాన్ని సందర్శించి తయారీ రంగ పరిశ్రమలకు నెలకోల్పే అంశం సాధ్యా సాధ్యాలను పరిశీలిస్తామని ప్లెక్స్‌ట్రానిక్స్‌ గ్రూప్‌ ప్రెసిడెంట్‌ పాల్‌ హంప్రీస్‌ హామీ ఇచ్చారు.

సిస్కో ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అండ్‌ చీఫ్‌ గ్లోబలైజేషన్‌ ఆఫీసర్‌ విమ్‌ ఎల్‌ఫ్రింక్‌తో సమావేశమైన లోకేష్‌  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానాన్ని వివరించారు. అందుకు స్పందించిన ఎల్‌ఫ్రింక్‌ వైజాగ్‌లో తమ పరిశ్రమను పెట్టేందుకు ఉన్న అవకాశాలపై చర్చిస్తామని హామీ ఇచ్చారు.  అమెరికా బిజినెస్‌ ప్రముఖుల్లో ఒకరైన వినోద్‌ ఖోస్లాతో సమావేశమయ్యారు.  ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఖోస్లా సంసిద్దతను వ్యక్తం చేశారు.లూసియానా గవర్నర్‌ బాబిజిందాల్‌తో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో సులబతర వాణిజ్యం కోసం చేపట్టిన చర్చలు సత్పలితాలు ఇచ్చాయని లోకేష్‌ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల స్థాపనకు తగిన తోడ్పాటు ఇస్తామని అప్లయిడ్‌ మెటిరియల్స్‌ ఉపాద్యాక్షుడు రణధీర్‌ఠాకూర్‌ హామీ ఇచ్చారు.

ప్రవాసాంధ్రులు నిర్వహించిన అనేక సమావేశాల్లో ముఖ్యఅతిధిగా పాల్గొన్న నారా లోకేష్‌ మాట్లాడుతూ స్మార్ట్‌ విలేజ్‌, స్మార్ట్‌ వార్డ్‌ కార్యక్రమం ప్రాముఖ్యత, అందులో ఎన్‌ఆర్‌ఐలు నిర్వహించాల్సిన కీలక పాత్రపై వివరించారు. రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని, గ్రామాలకు వారి వంతు సహాయం అందించాలని ఆయన పిలుపునిచ్చారు. అమెరికాలోని ప్రవాసాంధ్రులు, సుమారుగా 2400 మంది  ఏపీలో వివిధ గ్రామాల్లో, వార్డులను దత్తత తీసుకొని అభివృద్ధి చేయడం ద్వారా జన్మభూమి రుణం తీర్చుకోవడానికి ముందుకు రావడంతో  తెలుగువారికి ఆదర్శంగా నిలిచారని అభినందించారు. తన పర్యటన పల్ల సంతృప్తిని వ్యక్తం చేసిన లోకేష్‌ అమెరికాలో ఉంటున్నప్పటికీ ఎన్నారైలందరికీ మాతృదేశంపట్ట అమితమైన ప్రేమాభిమానాలు ఉన్నాయని, బ్రింగ్‌ బాబు బ్యాక్‌ ఉద్యమంలో వారంతా తెలుగుదేశం పార్టీకి ఎంతో సహకరించారని తెలిపారు. 

డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించేందుకు రాష్ట్రానికి రావాలని విసీఈ సీఈఓ ప్రవీణ్‌ అక్కిరాజు, ఈఎంసీ కార్పోరేషన్‌ సీఈవోలను ఆహ్వానించారు. న్యూజెరి, టెక్సాస్‌లో జరిగిన స్మార్ట్‌వార్డ్‌, స్మార్ట్‌ విలేజ్‌ కార్యక్రమానికి ఎన్‌ఆర్‌ఐలు  356 గ్రామాల అభివృద్ధిలో పార్ట్‌నర్లుగా వ్యవహరిస్తామని హామీ ఇచ్చారు. వాషింగటన్‌ డీసీ జరిగిన సమావేశంలో 600 గ్రామాల అభివృద్ధి భాగస్వాములు అయ్యేందుకు ఎన్‌ఆర్‌ఐలు సంసిద్దత వ్యక్తం చేశారు. తన అమెరికా పర్యటన విజయవంతం అయ్యేందుకు సహకరించిన తానా సభ్యులు, ఎన్‌ఆర్‌ఐలు టీడీపీ సభ్యులు, ఇతర ప్రవాంసాంధ్రులకు లోకేష్‌ కృతజ్ఞతలు తెలిపారు.

 

Tags :