ASBL NSL Infratech

స్మార్ట్ క్యాంపస్... స్మార్ట్ ఏపీ

స్మార్ట్ క్యాంపస్... స్మార్ట్ ఏపీ

దావోస్‌ పర్యటనలో పలువురితో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశమవుతున్నారు. నన్యాంగ్‌ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ ప్రెసిడెంట్‌ సుబ్రా సురేష్‌తోనూ ముఖ్యమంత్రి సమావేశం అయ్యారు. సింగపూర్‌లోని తమ వర్సిటీ క్యాంపస్‌ను స్మార్ట్‌ క్యాంపస్‌గా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రికి వివరించిన సుబ్రా సురేష్‌, ఇప్పటికే ఇందుకు సంబంధించి 60శాతం ప్రక్రియ పూర్తయిందని తెలిపారు.

వర్సిటీలో అంతర్గత రవాణా యావత్తూ ఎలక్ట్రికల్‌ వాహనాలేనని, 35శాతం ఇంథనం ఆదా అవుతోందని సుబ్రా సురేష్‌ వెల్లడించారు. తమ క్యాంపస్‌ ప్రపంచంలోనే అత్యుత్తమ ఎకో ఫ్రెండ్లీ క్యాంపస్‌గా అభివర్ణించారు. తమ బెస్ట్‌ ప్రాక్టిసెస్‌ను పరిశీలించడానికి ఈసారి సింగపూర్‌ పర్యటనలో ఒకసారి నన్యాంగ్‌ క్యాంపస్‌ను సందర్శించాలని ముఖ్యమంత్రిని సుబ్రా సురేష్‌ కోరారు. ఆంధ్రప్రదేశ్‌ మొత్తాన్ని స్మార్ట్‌ రాష్ట్రంగా మార్చాలని భావిస్తున్నట్టు సుబ్రా సురేశ్‌కు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చెప్పారు. ఇ-ప్రగతి, రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ తదితర కార్యక్రమాలను అమలు చేస్తున్నట్టు వెల్లడించారు. ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు, ఆరు వేలకు పైగా వర్చువల్‌ క్లాస్‌రూముల ఏర్పాటు, డ్రోన్ల వినియోగం, క్లౌడ్‌ హబ్‌ పాలసీ, 20 వేలకు పైగా సీసీ కెమెరాల వినియోగం గురించి ముఖ్యమంత్రి ఆయనకు వివరించారు.

Tags :