ASBL NSL Infratech

సిద్దిపేట జిల్లా, ఇందుర్తి ZPHS లో ఆటా RO ప్లాంట్ ప్రారంభం

సిద్దిపేట జిల్లా, ఇందుర్తి ZPHS లో ఆటా RO ప్లాంట్ ప్రారంభం

ఆటా వేడుకల్లో భాగంగా సిద్దిపేట జిల్లా, ఇందుర్తి ZPHS పాఠశాలకు ఆటా బోర్డ్ ఆఫ్ ట్రస్టీ కాశీ కొత్త & వారి కుటుంబం ఆర్థిక నిధులు, ఆటా సహకారంతో సుమారు 3 లక్షల రూపాయల నిధులతో స్కూల్ వేదికకు రేకుల షెడ్డు, పిల్లల కోసం తాగడానికి RO వాటర్ ప్లాంట్ నిర్మాణం, కంప్యూటర్, స్పోర్ట్స్ కిట్స్, స్కూల్ బ్యాగ్స్ అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆటా బోర్డ్ ఆఫ్ ట్రస్టీ కాశీ కొత్త మాట్లాడుతూ... నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిన భారత దేశానికి ఎంత చేసిన తక్కువేనని అన్నారు. ఈ రోజు ఆటా వేడుకల్లో భాగంగా నా వంతుగా ఇందూర్తి ZPHS పిల్లలకి ఉపయోగపడేవి అందించాను అన్నారు. ఇదే సందర్భంలో వారి కుటుంబాన్ని గ్రామ పెద్దలు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆటా బోర్డ్ ఆఫ్ ట్రస్టీ కాశీ కొత్త కుటుంబసభ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, ZPHS ప్రధానోపాధ్యాయులు, ఉపాద్యాయులు, విద్యార్థులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

 

Click here for Photogallery

 

 

Tags :