ASBL NSL Infratech

కేర్‍ యాక్ట్ తో ప్రయోజనాలపై తానా వెబ్‍ సమావేశం సక్సెస్‍

కేర్‍ యాక్ట్ తో ప్రయోజనాలపై తానా వెబ్‍ సమావేశం సక్సెస్‍

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) వెస్ట్ టీమ్‍ కేర్‍ యాక్ట్పై నిర్వహించిన వెబినార్‍ విజయవంతమైంది. చిన్న వర్తకులకు కేర్‍ యాక్ట్ వల్ల జరిగే ప్రయోజనాలను వివరించడంతోపాటు వారికి లభించే సౌకర్యాలను కూడా ఈ వెబినార్‍ తెలియజేసింది. కోవిడ్‍ 19 వైరస్‍ కారణంగా నష్టపోయినవారిని ఆదుకునేందుకు అమెరికా ప్రభుత్వం కల్పించిన కేర్‍ యాక్ట్ ద్వారా లభించే ప్రయోజనాలపై తానా ఈ వెబినార్‍ను నిర్వహించింది. ఎజి ఫిన్‍టాక్స్ ఫౌండర్‍, సిఇఓ అనిల్‍ గాంధీ ఈ యాక్ట్ ద్వారా లభించే ప్రయోజనాలను తెలియజేశారు. యుఎస్‍ స్మాల్‍ బిజినెస్‍ అడ్మినిస్ట్రేషన్‍ (ఎస్‍బిఎ) కరోనా వైరస్‍ కారణంగా నష్టపోయిన చిన్న వర్తకులకు తక్కువ వడ్డీతో రుణసౌకర్యాన్ని కల్పిస్తున్న విషయాలను తెలియజేశారు.

ఎస్‍బిఎ దాదాపు 7 బిలియన్‍ డాలర్లు లోన్‍గా అందిస్తోంది. 3.75శాతం వడ్డీతో 2 మిలియన్‍ డాలర్లను అప్పుగా ఇస్తోంది. నాన్‍ ప్రాఫిట్‍ ఆర్గనైజేషన్‍కు 2.75శాతం వడ్డీతో ఇస్తోంది. దాదాపు 30 సంవత్సరాల గడువుతో ఈ రుణం ఇస్తోంది. ఈ వెబ్‍నాయర్‍లో దాదాపు 500 బిజినెస్‍ సంస్థల యజమానులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినవారందరికీ తానా నార్త్ వెస్ట్ టీమ్‍ ధన్యవాదాలను తెలియజేస్తోంది.

తానా నార్త్ వెస్ట్ రీజినల్‍ కో ఆర్డినేటర్‍ దేవ్‍ లావు, కమిటీ చైర్స్ మహేష్‍ ఉదత, సురేంద్రబాబు, తానా కమ్యూనిటీ సర్వీసెస్‍ కో ఆర్డినేటర్‍ మల్లివేమన, రీజినల్‍ కోఆర్డినేటర్‍ రాజా కసుకుర్తి తదితరులు ఈ కార్యక్రమం విజయవంతానికి కృషి చేశారు. తానా అధ్యక్షుడు జయ్‍ తాళ్ళూరి, ప్రెసిడెంట్‍ ఎలక్ట్ అంజయ్య చౌదరి, సెక్రటరీ రవి పొట్లూరి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించి తానా యువ నాయకులను ప్రోత్సహించారు.

 

Tags :