ASBL NSL Infratech

వైద్యపరికరాల తయారీకి ప్రాధాన్యం - ముఖ్యమంత్రి

వైద్యపరికరాల తయారీకి ప్రాధాన్యం - ముఖ్యమంత్రి

ఆంధ్రప్రదేశ్‌లో వైద్యపరికరాల తయారీకు అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. దావోస్‌లో  గ్లోబల్‌ ఫార్మా కంపెనీ 'రోషే'  ప్రతినిధి క్రిస్టోఫె ఫ్రాంజ్‌ ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఫ్రాంజ్‌ మాట్లాడుతూ, భారత్‌లో తమ కంపెనీని మరింతగా విస్తరించాలని నిర్ణయించామని చెప్పారు.   ప్రస్తుతం తాము అత్యున్నత ఎలక్ట్రానిక్‌ మెడికల్‌ హెల్త్‌ రికార్డుల తయారీపై అధ్యయనం చేస్తున్న విషయాన్ని ఫ్రాంజ్‌ వివరించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో నాలుగు నెలల క్రితం ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇలాంటి ఉత్తమ ప్రయత్నం మొదలుపెట్టామని, మీరు కూడా కలిసి వస్తే సంయుక్తంగా చేపడదామని ఫ్రాంజ్నుకు ముఖ్యమంత్రి ఆహ్వానించారు. 'రోషే' సంస్థ ఏపీని తమ వైద్య పరికరాల తయారీ కేంద్రంగా చేసుకుంటే బావుంటుందని సూచించారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్కువ పన్ను విధానం అవలంభిస్తున్నాయని, దేశీయంగా వైద్య పరికరాల తయారీ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు.

 

Tags :