ASBL NSL Infratech

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

హైదరాబాద్‌లోని ముచ్చింతల్‌లో రామానుజాచార్యుల సహస్రాబ్ది వేడుకల్లో భాగంగా గురువారంనాడు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు కనులవిందు చేశాయి. సంప్రదాయ సంగీతం, భక్తి భజనలతో శ్రీరామనగరంలో ఆధ్యాత్మికత ఉట్టిపడింది. యాగశాలలో రుత్వికులు వేద మంత్రోచ్ఛారణ చేస్తుండగా.. ప్రవచన మండపంలో గాయని సురేఖ బృందం సంప్రదాయ సంగీతంతో వినసొంపైన గానాన్ని ఆలపించారు. శ్రీపాద రమాదేవి శిష్య బృందం ‘వాసుదేవాజ్మజ, నారాయణ.. శ్రీమన్నారాయణ’కీర్తనలకు కూచిపూడి నృత్య ప్రదర్శన చేశారు. నవవిధ భక్తి మార్గాల్లో భజన కూడా ఒకటి.. అలాంటి రంగంలో ప్రముఖ కళాకారుడుగా గుర్తింపు పొందిన నర్సింగరావు తన బృందంతో కలిసి ‘హరే కృష్ణ.. హరే కృష్ణ’ భజనకీర్తనలు ఆలపించారు. అలివేలు మంగనాథుడు గోవిందా అంటూ ఓ చిన్నారి ఆలపించిన భక్తి గీతం అలరించింది. జిమ్స్‌ మెడికల్‌ విద్యార్థులు నాటకాన్ని ప్రదర్శించారు. పావని, మాధవపెద్ది బృందం ప్రదర్శించిన నృత్య రూపకం విశేషంగా ఆకట్టుకుంది.

 

Tags :